Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తన దైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం జగన్‌ను విమర్శించిన పవన్ కల్యాణ్.. అతను ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదు.. పవన్ కల్యాణ్ అనే వాడు విప్లవకారుడు.. ఓ విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో సీఎం జగన్‌కు చూపిస్తాను అంటూ కామెంట్స్ చేసిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. పవన్ పై ఫైర్ అయ్యారు.. సంస్కారం లేని పవన్ నమస్కారం, సీఎం జగన్ కు అవసరం లేదన్నారు.. ఇక, పెళ్లిళ్లు చేసుకోవడంలో పవన్ విప్లవకారుడు.. పవన్ పెళ్లిళ్ల విప్లవాన్ని ప్రజలపై రుద్దుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు పార్టీలోకి వస్తారు.. అటువంటి వారు ఒకరు ఇద్దరు పార్టీ వీడిన మాకు నష్టం లేదంటూ.. విశాఖపట్నంలో తాజా రాజకీయాలపై బదులిచ్చారు మంత్రి.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ధైర్యం ఉంటే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పాలంటూ సవాల్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Dinner : రాత్రి పూట భోజనాన్ని ఎందుకు త్వరగా తినాలో తెలుసా?