జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు.. యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్దాలు ఆడారు.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ అంటూ విమర్శించారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు దగ్గుబాటి.. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.
వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు గ్రంధి శ్రీనివాస్.