Pawan Kalyan: సీఎం వైఎస్ జగన్ .. నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు.. దత్త పుత్రుడు అంటారు.. నేను భరించా.. కానీ, ఆయన్ని జగ్గు భాయ్ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ గారు నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా.. తర్వాత జగ్గు అంటా.. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు.. మీరు నోరు ఎంత జారితే నేను అంత జారుతానని ప్రకటించారు.. 2వ విడత వారాహి విజయయాత్ర ముగింపు సందర్భంగా తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా బలంగా నిలబడిన తణుకు ఇంఛార్జి విడివాడ రామచంద్ర రావుకి క్షమాపణలు చెబుతూ సభ మొదలు పెట్టారు పవన్.. వైసీపీ పరిపాలనపై, జగన్ పై క్రిటికల్ ఏనాలసిస్ చేద్దాం.. తణుకు నుంచి అనేకమంది కవులు , వక్తలు వచ్చారు.. జగన్ కు తణుకు నుంచి ఒక్కటే చెప్పదలుచుకున్నాం.. జగన్ కొంపలు అంటిస్తారు.. జసనేన గుండెలు మండిస్తుందన్నారు.
భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు.. చిన్నపుడు నేనే బజారుకి వెళ్లి కిరాణా సామాను తీసుకు వచ్చేవాడిని.. కానీ, సగటు మనిషి కష్టాలు జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు పవన్.. ఈ రోజు జగన్ పెంచిన ఖర్చులు సామాన్యుడిపై ఎలా ప్రభావం చూపుతుంది చెబుతా.. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచారు. గతం కంటే ఎక్కువ రేట్లు పెరిగాయి.. ఇసుక అందుబాటులో లేకుండా చేశారు.. మద్యం ధరలు పెంచి మద్యపాన ప్రియులపై భారం వేశారు.. రేట్లు పెంచినందుకేనా పరదాలు కట్టుకు తిరుగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇల్లు లేనివాడికి ఇళ్లు కట్టిస్తాం అని ప్రియతమ ముఖ్య మంత్రి 9,159 కోట్లు తీసుకున్నారు.. కానీ, ఇళ్లు కట్టలేదని ఆరోపించారు. తణుకులో TDS బాండ్ల పేరుతో పెద్ద స్కాం చేశారు.. మున్సిపల్ పార్క్ కడతాం అని 309 కోట్లు దోచేశారు.. దోపిడీ సంగతి అలా పెడితే అన్నింటి పై పన్నులు పెంచేశారు.. తక్కువ రేట్లకు స్థలాలు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్మేసారు.. ఇందులో 50 కోట్లు దోచేశారు.. ఇళ్లు కట్టక ముందే పూడ్చి వేత పేరుతో డబ్బులు నొక్కేశారని ఆరోపణలు గుప్పించారు.
తణుకులో జరిగిన స్కామ్‌లో అసలు వాళ్లు దొరకలేదు.. కమిషనర్ దొరికాడు అన్నారు పవన్.. దోచేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్లకు వత్తాసు పలికిన అధికారులు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో డంపింగ్ యార్డ్ లేదు.. చెత్త పరిపాలనలో చెత్త ఎక్కడ వేయాలి? అని ప్రశ్నించారు. RBK, గ్రామ సచివాలయాలు పూర్తి చేయలేదు.. సమస్యలు చెబితే మంత్రి ఏం మాట్లాడారో అందరికీ తెలుసని ఫైర్ అయ్యారు. దువ్వ గ్రామంలో రైతులపై కేసులు పెట్టారు.. జగన్ ఎలాగో పోలవరం పూర్తి చేయలేరు.. 30 కోట్లు ఇచ్చి ఎర్ర కాలువ సమస్య అయిన తీర్చండి అని కోరారు. రైతులు గిట్టు బాటు ధర అడిగితే మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు పవన్.
జగన్ ను జగ్గుభాయ్ అని ఎందుకు అంటున్నానో ఆయన చేసిన దోపిడీ చూస్తే అర్థం అవుతుందన్నారు పవన్ కల్యాణ్.. గళ్ల లుంగీ, బుగ్గన చుక్క జగ్గు భాయ్ కి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఎది అడిగినా మీకోసం ఖర్చు చేస్తున్నాం అంటారు.. పథకాలు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్తున్నారు.. దారి మళ్లించి వాటి లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. ఇక, జగన్ కొత్త పథకాలు ఏమీ చేయడం లేదు.. వృద్ధాప్య పింఛన్లుతో సహా పాత పథకాల పేర్లు మార్చారు అంతే అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆయన.. జగన్ డిజిటల్ దొంగలా మారారు.. ప్రొవిడెంట్ ఫండ్ అంటే తెలుసా జగన్..? అని ప్రశ్నించారు.. జగ్గుభాయ్ అంటుంటే..వైసిపి నాయకులు బాధ పడుతున్నారు.. జగ్గుభాయ్ అంటుంటే వైసీపీ నేతలకు వళ్లంతా కారం రాసుకున్నట్టు ఉందన్న ఆయన.. మీరు అందరినీ బూతులు తిడతారు.. రైతులు గిట్టు బాటు ధర లేదంటే మంత్రి ఏర్రిపప్ప అనేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.