HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
Pakistan: పాకిస్తాన్ ఆప్తమిత్రుడు చైనా ఆ దేశానికి కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్‌ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్‌కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్‌ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.
NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది.
PM Modi: భారత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగాత్మకంగా ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) పరీను శనివారం విజయవంతంగా నిర్వహించింది. క్రూమాడ్యుల్‌ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు, ఆ తరువాత క్రూ మాడ్యుల్, రాకెట్ నుంచి విడిపోయి పారాశ్యూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా పడింది.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ‘ ప్రశ్నకు డబ్బు’ కేసులో చిక్కుకుపోయారు. వ్యాపారవేత్త నుంచి డబ్బులు, విలువైన గిఫ్టులను తీసుకుని పార్లమెంట్లో అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు.
Swiss woman's murder: ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో శుక్రవారం స్విట్జర్లాండ్ మహిళ హత్యకు గురైంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీనా బెర్గర్(30) అనే మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ప్రభత్వ పాఠశాల సమీ
ఇదిలా ఉంటే భారత్ వియన్నా కన్వెన్షన్ ను ఉల్లంఘిస్తుందని కెనడా గగ్గోలు పెడుతోంది. అయితే దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూటిగా సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశానికి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. నాలుగేళ్లుగా యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్న నవాజ్ మరోసారి రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో గడిపిన షరీఫ్, ఈ రోజు అక్కడ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి చేరుకున్నారు.
India TV-CNX Opinion Poll: 5 రాష్ట్రాల ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరబోతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి రావచ్చని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ కేవలం 72 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక స్వతంత్రులు, ఇతర పార్టీల వారు కేవలం…
Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం అణిచివేతతో రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.