Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేశారు. కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి ప్రజలను చిన్నాపెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊచకోత కోశారు.
India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.
Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులోని లాహోర్కి భారీ ర్యాలీ నడుమ వచ్చారు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశించి ర్యాలీలో ప్రసంగించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.
ఈ పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీఎంసీ లీడర్లు అరెస్టు అయిన సందర్భాల్లో టీఎంసీ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, మహువా మోయిత్రాకు మద్దతిస్తుందా..? లేదా..? అనేది టీఎంసీ వివరించాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు
Garba events: నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగాయి. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీయువకులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న కొందరు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గర్బా వేడకలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అప్పటి వరకు తమ ముందు ఆనందంగా, నవ్వుతూ డ్యాన్స్ చేసిన వ్యక్తులు గుండె పోటుతో మరణించడం చాలా మందిని కలిచివేస్తోంది.
Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాద సంస్థను నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. వెతికివెతికి కీలక హమాస్ నాయకులను టార్గెట్ చేస్తూ హతమారుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది మరణించారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ హమాస్‌ని నేలమట్టం చేస్తామని ప్రమాణం చేశారు.
Asaduddin Owaisi: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం రెండు వారాలకు చేరింది. అక్టోబర్ 7న జరిగిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగాల్లోకి ప్రవేశించి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. 200 మంది కన్నా ఎక్కువ మందిని హమస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో 4000 మంది మరణించారు. మొత్తంగా ఈ రెండు వర్గాల మధ్య వార్ కారణంగా మరణాల సంఖ్య…
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న హమాస్ మారణకాండ వల్ల ఇజ్రాయిల్ లో 1400 మంది మరణించారు. హమాస్ అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు, వృద్ధులని చూడకుండా ఊచకోత కోసింది. ఈ ఘటన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో 4000 మంది మరణించారు.
Panipuri: ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి జరిపారు. ఈ దాడిలో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా దారుణంగా ఊచకోతకు పాల్పడ్డారు.