Israel-Hamas War: డ్రగ్స్ మత్తులో హమాస్ ఉగ్రవాదుల అరాచకం.. ఇజ్రాయిల్‌పై దాడిలో కొత్త విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై భీకరదాడులు చేశారు. అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా దారుణంగా మారణహోమానికి పాల్పడ్డారు. చిన్న పిల్లల్ని కనికరం లేకుండా తలలు నరికి హత్యలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది మరణించారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసే సమయంలో హమాస్ ఉగ్రవాదులు ‘సైకోయాక్టివ్’ డ్రగ్స్ ప్రభావంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు సింథటిక్ యాఫెటమైన్ స్టిమ్యులేటర్ అయిన కాప్టాగన్ అనే డ్రగ్ ప్రభావంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని ‘పేదవాళ్ల కొకైన్’ అని పిలుస్తుంటారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
Read Also: Scammers: ఏడాదిలో 1.02 ట్రిలియన్ డాలర్లను కొల్లగొట్టిన స్కామర్లు.. ఎక్కువగా ప్రభావితమైన దేశాలు ఇవే..
దాడుల సమయంలో హతమైన హమాస్ ఉగ్రవాదుల జేబుల నుంచి క్యాప్టాగన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ఈ డ్రగ్‌ని ఉగ్రవాదులు నేరాలకు పాల్పడే సమయంలో తీసుకుంటారని, ఇది వారిని ఎక్కువ సేపు అప్రమత్తంగా ఉంచడంతో పాటు ఆకలి కాకుండా చేస్తుందని పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ముందు భయాన్ని అణిచివేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీటిని ఉపయోగించారని 2015లో క్యాప్టాగన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఐసిస్ క్షీణించడంతో క్యాప్టాగన్ కు గాజా ప్రాంతంల మార్కెట్ గా మారిందని తెలిపింది.
‘క్యాప్టగాన్’ యాంఫేటమిన్ కుటుంబానికి చెందినది. దీన్ని మానసిక రుగ్మతలు, డిప్రెషన్ కు వాడుతారు. ఇది ఆనందాన్ని పెంచడం, నిద్ర అవసరాన్ని తగ్గించడం, ఆకలిని తట్టుకోవడం, నిరంతర శక్తి కోసం వాడుతారు. ప్రస్తుతం ఈ ఔషధం సిరియాకు ఆదాయ వనరుగా ఉందని జెరూసలేం పోస్టు తెలిపింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!