China: పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకునేందుకు చైనా సిద్ధం..బట్ వన్ కండీషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్ తో మరింతగా సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) కోసం బిలియన్ల కొద్దీ డబ్బును ఖర్చు పెడుతోంది చైనా. ఇక ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ని కౌంటర్ చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ తో తన సంబంధాలు బలంగా ఉండాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని చైనీయులు ఇటీవల కాలంలో దాడుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో అక్కడి తిరుగుబాటుదారులు, ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో చైనా తన సంబంధాలను పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అక్కడ పనిచేస్తున్న చైనా సంస్థలు, సిబ్బంది భద్రతకు హామీ ఇవ్వాలని చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ దేశంలో చైనా కీలక పెట్టుబడిదారుగా ఉంది. అయితే అక్కడి వేర్పాటువాద, ఇస్లామిక్ గ్రూపులు చైనా ప్రాజెక్టులు, చైనా సిబ్బందిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతోంది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ఈ వారం చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ఫోరం సమావేశానికి పాకిస్తాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ గురువారం జిన్ పింగ్‌ని కలిశారు. సీపెక్ ప్రాజెక్టులో భాగంగా ఇండస్ట్రియల్ పార్కులు, వ్యవసాయం, మైనింగ్, న్యూ ఎనర్జీ, ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో సహకారం పెంపొందించుకోవాలని జిన్ పింగ్ అన్నారు. అయితే అదే సమయంలో చైనా ప్రయోజనాలకు భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
సీపెక్ కింద పాకిస్తాన్ లో చైనా 25 బిలియన్ డాలర్ల విలువైన 50 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, రోడ్, రైల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కోసం మరో 65 బిలియన్ల ఇస్తానని చైనా తెలిపిందని పాక్ ప్రధాని కాకర్ అన్నారు. యూఎన్, ఎస్‌సీఓ ఫ్రేమ్ వర్క్ కింద అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్ పింగ్ అన్నారు.
- Tags
- china
- CPEC
- Pakistan
- Xi Jinping
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!