Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులను కూడా తీవ్రతరం చేసింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాలో పాటు, గాజా నగరంపై దృష్టి పెట్టిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు సురక్షితం అనుకున్న దక్షిణ గాజాలోని పట్టణాలపై కూడా దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న ప్రతీ చోట బాంబుల వర్షం కురిపిస్తోంది.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన ‘టెస్లా’ భారతదేశంలో అడుగుపెట్టేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే దీనిపై టెస్లా ప్రతినిధులు, భారత ప్రభుత్వంతో చాలా సార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా తన కార్లను దిగుమతి చేయబోతుందని తెలస్తోంది. మరో రెండేళ్లతో ఇక్కడ టెస్లా తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Ship Hijack: టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రస్తుతానికి తెలియదు. హైజాక్ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది.
Earthquake: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్సీఎస్) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు రాత్రి 7.36 గంటలకు 120 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీనికి ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Illicit affairs: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట భర్తను హత్య చేస్తే, మరో సంఘటనలో భార్య హత్యకు గురైంది.
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
Manipur: జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగంలో 170 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయి ఉండటం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ ముందు నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యంత్రాలను రప్పించి డ్రిల్లింగ్ చేశారు. అయితే ఈ ప్రయత్నాలు…