India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదే కాకుండా కెనడియన్ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
North Korea: ఉత్తర కొరియా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సాయుధ దళాలు వెల్లడించాయి. దక్షిణం వైపుగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఈ ప్రయోగాన్ని ధృవీకరిస్తూ జపాన్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత దక్షిణ కొరియా ప్రయోగం గురించి మంగళవారం ప్రకటించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అలాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్‌కి చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 752 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి…
Uttar Pradesh: కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండటం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది.
Ghol fish: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’ని ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా-2023 సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘోల్ ఫిష్‌ని గుజరాత్ రాష్ట్ర చేపగా ప్రకటించారు.
Heart Attack: ప్రస్తుతం టెక్ రంగంలో AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో మానవ జీవితాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఏఐ మానవుడి ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడునుంది. పెద్ద డేటా సెట్లను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి, అంచనాలు రూపొందించడానికి AI సాంకేతికత ఉపయోగపడుతోంది.
NCERT: పాఠ్యపుస్తకాల్లో ఇటీవల కాలంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కీలక సిఫార్సులను చేస్తోంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పాఠశాలల్లోని తరగతి గదులపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషాల్లో రాయాలని సూచించినట్లు ఎన్సీఈఆర్టీ కమిటీ సూచించిటన్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలను నివేదించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన కమిటీ పాఠ్యపుస్తకాల్లో మార్పులను ప్రతిపాదించినట్లు కథనాల్లో…