Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit affairs: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట భర్తను హత్య చేస్తే, మరో సంఘటనలో భార్య హత్యకు గురైంది.
లక్నోలో పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ని భార్య, బావమరిది కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ సింగ్ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె సోదరుడు దేవేంద్ర కుమార్ వర్మ కలిసి గత ఆదివారం రాత్రి హత్య చేశారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఇన్‌స్పెక్టర్ సతీష్ సింగ్ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. సతీష్ సింగ్ భార్య భావనా సింగ్, అతనికి మధ్య ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో గొడవలు జరుగుతుండేవని, సోదరి బాధ చూడలేక దేవేంద్ర కుమార్ సతీష్ సింగ్ హత్యకు ప్లాన్ చేశాడు. ఇద్దరు కలిసి అతడిని హత్య చేసినట్లు లక్నో సౌత్ డీసీపీ వినీత్ జైస్వాల్ చెప్పారు.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు సైకిల్ కొని హుడీ టీషర్ట్ ధరించి ఈ ఘటనకు పాల్పడ్డారు. 10 కిలోమీటర్ల పరిధిలోని 400 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.
లవర్‌తో పట్టుబడ్డ భార్యను కాల్చి చంపాడు:
బరేలీ జిల్లాలోని గోటియా గ్రామంలో 35 ఏళ్ల మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసిన భర్త ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. షాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సమీపంలోని పొలంలో శనివారం అర్థరాత్రి కాలిపోయిన అంజలి మృతదేహం లభ్యమైంది.
అంజలిని సజీవ దహనం చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంజలి భర్త నేపాల్ సింగ్ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతోనే చంపినట్లు ఒప్పుకున్నాడు.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..