Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
Read Also: Tiger Nageshwar Rao : అమెజాన్ ప్రైమ్ లో రజినీకాంత్ ని వెనక్కి నెట్టిన రవితేజ
ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన పోలీసుల్ని రామచంద్ర, కుంభారం, సురేష్ కుమార్, తానారామ్, మహేంద్ర కుమార్, సుఖ్‌రామ్‌గా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
చనిపోయిన పోలీసులు నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సరన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పోలీసులు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.