Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగంలో 170 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయి ఉండటం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ ముందు నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యంత్రాలను రప్పించి డ్రిల్లింగ్ చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో కొండ పై నుంచి నిలువుగా రంధ్రం చేసి కార్మికులను వెలికి తీసుకురావాలని ఆపరేషన్ మొదలుపెట్టారు.
గత సాయంత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నంచి హై పెర్ఫార్మెన్స్ డ్రిల్లింగ్ మిషన్‌ని తీసుకువచ్చిన తర్వాత నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించడానికి ఫ్లాట్‌ఫారం నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. పీఎంఓ అధికారుల బృందం, ఇతర నిపుణులు 41 మందిని రక్షించేందుకు ఏకకాలంలో 5 ఫ్లాన్స్ ద్వారా పనిచేస్తున్నారు. అన్ని సహకరిస్తే మరో నాలుగైదు రోజుల్లో కార్మికులు రక్షించబడతారని ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్చే అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పనులను సమీక్షించారు. అయితే కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు.
Read Also: Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
41 మంది ఏడు రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయి ఉండటంతో వారి ఆరోగ్యానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మల్టీ విటమని, యాంటి డిప్రెసెంట్స్ మాత్రలను అందిస్తున్నారు. డ్రైఫ్రైట్స్ కార్మికుల కోసం లోపలకి ఇనుప పైపుల ద్వారా పంపుతున్నారు. లోపల కరెంట్, వెలుతురు ఉంది. టన్నెల్ కూలినప్పుడు విద్యుత్‌కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నిర్మాణంలో ఉన్న సొరంగం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ప్రాజెక్ట్‌లో భాగం, ఇది హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్మిస్తోంది.