Asaduddin Owaisi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇతరులపై వేళ్లు చూపించే ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలని శనివారం అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు.
Dowry Harassment: ఒక మహిళ తన భర్త, అత్తామామలపై వేధింపులు, క్రూరత్వం, దొంగతనం ఆరోపణలతో కేసు పెట్టింది. అయితే సదరు మహిళ కేవలం అత్తగారి ఇంట్లో 11 రోజులు మాత్రమే ఉంది. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు, మెజిస్ట్రియల్ కోర్టు ఆదేశాలను సమర్థించింది. ఈ కేసు చట్టవిరుద్ధంగా లేదని చెప్పింది.
Dog Meat: శతాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా స్వస్తి పలకనుంది. కొన్నేళ్లుగా దక్షిణ కొరియాలోని ప్రజలు కుక్క మాంసాన్ని తింటున్నారు. అయితే ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని అధికార పీపుల్ పవర్ పార్టీ ఈ ఏడాది చివరి నాటికి కుక్క మాంసం వినియోగంపై నిషేధాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. కుక్క మాంసం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ముఖ్యంగా యువతరాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అలాగే జంతు హక్కుల సంఘాల నుంచి అంతర్జాతీయంగా…
Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్‌లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు.
Rohit Sharma: రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీం ఇండియాను విజయపథంలో నడిపిస్తున్న సారథి. కెప్టెన్‌గా వరల్డ్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నారు. ఇటు ఓపెనర్‌గా బౌలర్లను ఊచకోత కోస్తూ.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. మరోక్క విజయం సాధిస్తే, వరల్డ్ కప్ అందుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కుతారు. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్, భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు హై లెవల్ పీపుల్ మధ్య ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హై టెన్షన్…
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్‌ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది.
World Cup 2023: దాదాపుగా 20 ఏళ్ల తరువాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి. చివరి సారిగా 2003లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్‌లో ఆడాయి. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్ మాత్రం కోట్లాది మంది భారత అభిమానులకు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత విజయాన్ని అడ్డుకున్నాడు
World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఏ నోట చూసినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించే వినబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తం క్రికెట్ ఫ్యాన్స్ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తిరంగాలతో సంబరాలు చేసుకుంటున్నారు.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఇజ్రాయిల్ దాడుల వల్ల 11 వేల మంది చనిపోయారు.