Earthquake: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్‌సీఎస్) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు రాత్రి 7.36 గంటలకు 120 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీనికి ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Read Also: Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..
ఇండియాలో హిమాలయ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు అధిక భూకంప తీవ్రత కలిగిన ప్రాంతాల్లో ఉన్నాయి. జోన్ -5లో ఈ ప్రాంతాలు ఉన్నాయి. హిమాలయ ప్రాంతాల్లో భారత టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెట్టడం ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతోంది. ఇక అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మీస్ టెక్టానిక్ ప్లేట్ సర్దుబాటు ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణంగా ఉంది.