PM Modi: ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్(AI) వేగవంతమైన వృద్ధితో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని సరిగా పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలునిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జీ-20 దేశాలు సంయుక్తంగా పనిచేయాలని కోరారు. బుధవారం వర్చువల్‌గా జరిగిన జీ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేయాలని సూచించారు. ఏఐ ప్రజలకు చేరువకావాలి.. ఇది సమాజానికి సురక్షితంగా ఉండాలని ప్రధాని అన్నారు.
NIA: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ మేరకు పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబ్‌లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్‌పూర్, మొహాలీ, పాటియాలా, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
'Panauti' row: ప్రధాని నరేంద్రమోడీని చెడు శకునంగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌కి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలోర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. చెడుశకునం కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో వివాదంలో ఇరుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పోలీసులను బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయానికి మించి ప్రచారం చేయడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీస్ ఇన్స్పెక్టర్ని బెదిరించాడు.
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్రయేమం ఉందని, భారతదేశానికి అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. 23 లక్షల జనాభా ఉన్న అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంపై దాడులు చేయడం వల్ల అక్కడ 13 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే వీరిలో 5 వేల మంది వరకు చిన్నారులు ఉండటంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా భారత్‌లో ఎంట్రీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలోకి టెస్లా కార్లను దిగుమతి చేసుకునే దిశగా భారత ప్రభుత్వం, టెస్లా మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో రెండేళ్లలో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా సిద్ధమవుతోంది. భారత్‌లో కొత్త ప్లాంట్ కోసం టెస్లా ఏకంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఏదో ఒక రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరిలో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్…
Iceland: యూరోపియన్ దేశం ఐస్లాండ్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వరసగా భూకంపాలు, అగ్ని పర్వతాల ప్రకంపనలు ఆ దేశాన్ని భయపెట్టిస్తున్నాయి. ఏ క్షణమైన అగ్ని పర్వతం భారీ విస్పోటనం చెందొచ్చని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్ని పర్వత వ్యవస్థకు దగ్గరగా ఉన్న గ్రిండావిక్ పట్టణంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్‌ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా స్పందించారు.
Tamil Nadu: తమిళనాడులోని ఇద్దరు అధ్యాపకులు సున్నితమైన అంశాన్ని వివాదంగా మార్చారు. కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గొడ్డుమాంసం తిన్నందుకు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ తిన్నందుకు తమన చిన్నారిని ఉపాధ్యాయులు వేధించడమే కాకుండా కొట్టారని సదరు కుటుంబం ఆరోపించింది.