Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులను కూడా తీవ్రతరం చేసింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాలో పాటు, గాజా నగరంపై దృష్టి పెట్టిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు సురక్షితం అనుకున్న దక్షిణ గాజాలోని పట్టణాలపై కూడా దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న ప్రతీ చోట బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన 250 లక్ష్యాలపై ఇజ్రాయిల్ వైమానిక దాదడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్‌కి చెందిన ఉగ్రవాదులు పదుల సంఖ్యలో మరణించారు. మిస్సైల్ లాంచర్, ఇతర మౌలిక సదుపాయాలను ఇజ్రాయిల్ సైన్యం ధ్వంసం చేసింది. రాత్రి సమయంలో కాంబాట్ హెలికాప్టర్ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని ధ్వంసం చేసింది. అంతకుముందు ఇక్కడి నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ వాణిజ్య నగరం టెల్ అవీవ్‌పైకి రాకెట్లను ప్రయోగించారు. హరెల్ బ్రిగేట్‌కి చెందిన సైనికులు గాజా స్ట్రిప్ లోని నక్బా దళానికి ఉగ్రవాది ఇంటిలో ఆయుధాల నిల్వను కొనుగొన్నారు.
Read Also: Pakistan Cricket: పాకిస్తాన్ బౌలింగ్ కోచ్లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ నియామకం
మరోవైపు గాజా స్ట్రిప్ ప్రాంతంలోని అతిపెద్ద ఆస్పత్రులు హమాస్ ఉగ్రవాదులకు స్థావరాలుగా మారాయి. ఈ ఆస్పత్రుల కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్‌ని ఇజ్రాయిల్ సైన్యం కనుగొంది. ముఖ్యంగా గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫా కింద హమాస్ కమాండ్ సెంటర్‌తో పాటు ఆయుధాలను కూడా సైన్యం వెలుగులోకి తెచ్చింది. ఆస్పత్రులను స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీంతో గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఇజ్రాయిత్ దాడులు చేస్తుందనే భయంతో అల్ షిఫా ఆస్పత్రి నుంచి వేలాది మంది రోగులు బయటకు వెళ్లిపోయారు. ఆస్పత్రిలోని రోగుల్ని మానవకవచాలుగా ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపించింది.