Aadi Saikumar: మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్.. ‘నీలకంఠ’ను హిట్ చేయండి!
- మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేసిన సినిమా 'నీలకంఠ'
- జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
- మహేంద్రన్ నాకు మంచి స్నేహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ… ‘మహేంద్రన్ నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. మాతో పాటు హీరోలు సూర్య, కార్తి, ఆర్య కూడా ఫైట్స్ నేర్చుకునేవారు. క్యూ లైన్‌లో మా ముందు సూర్య, కార్తి, ఆర్య ఉండేవారు. నేను, మహేంద్రన్ రిహార్సల్స్ చేసే వాళ్లం. మహేంద్రన్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేశాడు. అతడు మంచి యాక్టర్. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారి చిన్నప్పటి రోల్లో అద్భుతంగా నటించాడు. విజయ్ గారి లాంటి గొప్ప యాక్టర్ నటనను మ్యాచ్ చేశాడు. అక్కడే మహేంద్రన్ ఏంటో నిరూపించుకున్నాడు. నీలకంఠ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. నీలకంఠ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను జనవరి 2న థియేటర్స్ చూసి హిట్ చేయండి’ అని అన్నారు.
Also Read
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
Also Read: Hrithik Roshan-Don: గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్.. నెక్ట్స్ డాన్ హృతిక్ రోషనా?
హీరోయిన్ యష్న ముతులూరి మాట్లాడుతూ… ‘రియల్ లొకేషన్స్‌లో రియల్ ఎమోషన్స్‌తో ఉండే సినిమా ఇది. ఈ సినిమాలో నేను సీత క్యారెక్టర్‌లో నటించాను. శివుడి గురించి ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి అని అంటున్నారు. ఇది ఇంకా కొత్తగా ఉంటుంది. శివుడు హాలాహలం తాగినప్పుడు ఆయన శరీరమంతా ఆ విషం నిండకుండా పార్వతీదేవి గొంతు దగ్గరే ఆపిందట. అలా నేను హీరో క్యారెక్టర్‌కు చిన్న సపోర్ట్, బలాన్ని ఇస్తుంటా. తెలుగు అమ్మాయి అయిన నాకు ఇందులో హీరోయిన్‌గా అవకాశం రావడం హ్యాపీగా ఉంది. సీత లాంటి క్యారెక్టర్స్ నేను చేయాలని మా అమ్మ కోరిక. అది ఈరోజు నెరవేరింది. నీలకంఠ సినిమాకు మీరంతా ఇస్తున్న మద్దతుకు థ్యాంక్స్. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్‌లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!