IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది.
Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
Snake-bite scam: మధ్యప్రదేశ్ లో ‘‘పాము కాటు కుంభకోణం’’ వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే, ఏకంగా 280 సార్లు మరణించారని ప్రకటించారు. ప్రతీసారి రూ. 4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయాన్ని పొందారు. ఫలితంగా మొత్తం రూ. 11 కోట్ల 26 లక్షల అవినీతి జరిగింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడితో సహా 20 […]
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ దేశంలో సంచలనంగా మారింది. ఆమెకు పాకిస్తాన్‌పై ఉన్న ప్రేమ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించి ఆమె, పలువురు పాక్ ఏజెంట్లను కలుసుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున ఒక కథనాన్ని ప్రచారం చేయడానికి ఆమె తన వీడియోలను వాడుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. 33 ఏళ్ల యూట్యూబర్ ప్రస్తుతం హర్యానా…
Pakistan Spies: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో యూపీ యాంటీ-టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో, ప్రభుత్వం యూ-టర్న్…
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.
Agniveers: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ వైమానిక ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయింది. మొత్తం 11 పాక్ ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. దీనికి తోడు పాకిస్తాన్, పీఓకే లోని లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, ట్రైనింగ్ కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు.