Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసు.. ఆమెకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..
- గూఢచారి జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసిన పాక్-లింక్డ్ సంస్థ..
- అదే సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ దేశంలో సంచలనంగా మారింది. ఆమెకు పాకిస్తాన్‌పై ఉన్న ప్రేమ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించి ఆమె, పలువురు పాక్ ఏజెంట్లను కలుసుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున ఒక కథనాన్ని ప్రచారం చేయడానికి ఆమె తన వీడియోలను వాడుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. 33 ఏళ్ల యూట్యూబర్ ప్రస్తుతం హర్యానా పోలీస్ కస్టడీలో ఉన్నారు. గత రెండు వారాల్లో ఈమెతో పాటు 11 మంది పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్ చేయబడ్డారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో పనిచేస్తున్న యూఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ వీగోతో జ్యోతి మల్హోత్రా సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా తరుచుగా చేసే ప్రయాణాలకు వీగోనే స్పాన్సర్ చేసినట్లు తేలింది. అయితే, ఈ సంస్థ ఇప్పుడు అజర్ బైజాన్‌తో రెండు రోజుల క్రితం కీలక ఒప్పందం చేసుకుంది. అజర్ బైజాన్ టూరిజం బోర్డుతో వీగో ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!
ఇటీవల భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగాలతో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై ‘‘ఆపరేషన్ సిందూర్’’పేరుతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్ని అజర్ బైజాన్ బహిరంగంగా ఖండించింది. పాక్ అమాయక పౌరులపై భారత్ దాడులు చేస్తుందని ఆరోపించింది. భారత్‌కి వ్యతిరేకంగా టర్కీతో పాటు అజర్ బైజార్ పాకిస్తాన్ వైపు నిలబడ్డాయి.
గూఢచర్యం కింద అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు ఈ సంస్థకు సంబంధం ఉండటం, ఇదే సంస్థ అజర్ బైజార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్ గూఢచర్యం, నిధులతో వీగోకు సంబంధాలు ఉన్నట్లు ప్రత్యక్ష ఆధారాలు లేనప్పటికీ, ఈ కేసు సందర్భంగా దేశంలో దీని కార్యకలాపాలపై ఆందోళన నెలకొంది. వీగో ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. దుబాయ్, బెంగళూర్, జకర్తాలో దీని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో టూరిస్టులకు, వినియోగదారులకు విమాన సంస్థలు, హోటళ్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఎజెన్సీలలో ధరల్ని పోల్చడంలో సహాయపడేందుకు రూపొందించిన ట్రావెల్ మెటాసెర్చ్ ఇంజన్.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!