Jyoti Malhotra: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయం దేశంలో సంచలనంగా మారింది. జ్యోతితో పాటు మరో 11 మంది పాక్ కోసం గుఢచర్యం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రా నుంచి విచారణ అధికారులు, నిఘా ఏజెన్సీలు కీలక విషయాలను రాబడుతున్నాయి.
PM Modi: పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్‌బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, […]
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇదిలా ఉంటే, మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో, ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’కి సమీపంలో బంగ్లాదేశ్ లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరిస్తోంది. ఇది భారత్‌కి 100 కి.మీ దూరంలో ఉంది. దీని పునర్నిర్మాణంలో చైనా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్ […]
Pakistan: లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడు అమీర్ హంజాకు అనుమానాస్పద స్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కి అమీర్ హంజా అత్యంత సన్నిహితుడు. ఈ ఉగ్రసంస్థ 17 మంది సహ వ్యవస్థాపకుల్లో హంజా కూడా ఒకడు. లష్కరే ప్రధాన సిద్ధాంతకర్తగా హంజా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను ఆప్ఘనిస్తాన్‌లో అప్పటి సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత హఫీజ్ సయీద్‌తో చేతులు కలిపాడు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం పాకిస్తాన్లో హీరోగా మారాడు, ముఖ్యంగా పాక్ మీడియా ఇటీవల రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని కోట్ చేస్తూ తెగ సంబరపడిపోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోని ట్వీట్ చేసి, ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే కాకుండా భారత్ ఎన్ని […]
Asim Munir: పాకిస్తార్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత సైనిక హోదాతో సత్కరించింది. ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా ప్రమోషన్ లభించింది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో, సాయుధ దళాల్లో అద్భుతంగా ఆపరేషన్స్ నిర్వహించిన వారికి మాత్రమే ఇచ్చే గౌరవ పదోన్నతి. ప్రధాన మంత్రి షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆర్మీ చీఫ్‌కి పదోన్నతి కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ […]
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్‌తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్‌లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న…
Murshidabad Violence Report: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయని, హింసలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని పేర్కొంది. సహాయం కోసం పిలిచినప్పటికీ పోలీసులు స్పందించడంలో విఫలమైనట్లు నివేదిక తెలిపింది.
Spying: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది.