Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొనడంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. డీఎంకే నాయకత్వం ఈడీ లేదా ప్రధాని మోడీకి భయపడదని అన్నారు. తమిళనాడు ప్రజలకు సరైన ఆర్థిక కేటాయింపులు సాధించాలనే ఆసక్తితోనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Operation Sindoor: భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్‌కి నొప్పి తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలతో పాటు దాని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ వైమానిక దళానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ‘‘రఖైన్ కారిడార్’’ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతం నుంచి మయన్మార్ రఖైన్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’ అంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ మాత్రం తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు లేకుండా మరో 5 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
Neha Singh Rathore: వివాదాస్పద ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో నిలిచారు. ముఖ్యంగా, ఈమె బీజేపీ వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి తన వీడియోలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నేహాసింగ్‌పై మళ్లీ కేసు నమోదైంది. సామాజిక సంస్థ సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సౌరభ్ మౌర్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు ఆపడం లేదు. ఇటీవల, ఆపిల్ అధినేత టిమ్ కుక్‌తో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో, భారత్‌లో ప్లాంట్ నెలకొల్పవద్దని, అమెరికాలో పెట్టాలని కోరారు. "అతను భారతదేశం అంతటా ఫ్లాంట్లు నిర్మిస్తున్నాడు. మీరు భారతదేశంలో ఫ్లాంట్లు నిర్మించడం నాకు ఇష్టం లేదు." అని ట్రంప్ అన్నారు.
Pak spy: పాకిస్తాన్‌కి గూఢచారులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు.
Bengaluru: మొబైల్ ఫోన్ సౌండ్ తగ్గించాలని కోరినందుకు భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మే 19న ఉత్తర బెంగళూర్‌లోని సిదేదహల్లిలోని ఎన్ఎంహెచ్ లేఅవుట్లో జరిగింది. మొబైల్ ఫోన్లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడంపై భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైందని శనివారం పోలీసులు తెలిపారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించబోతున్నారు. మే 26, 27 తేదీల్లో ఆయన గాంధీనగర్, కచ్, దాహోద్ సహా మూడు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోడీ భుజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఈ సభకు లక్ష మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది. బహిరంగ సభ తర్వాత మోడీ ఆశాపుర ఆలయాన్ని సందర్శిస్తారు. Read Also: Theatres Closure : […]
S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.