Karumuru Venkat Reddy: ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో హద్దులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా పేరిట వ్యక్తిగత అజెండాలతో, రాజకీయ బ్రోకరిజానికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. ఆ ఛానెల్ కథనంపై భట్టి విక్రమార్క ఫైర్..
ప్రతిరోజూ హద్దులు దాటి ప్రవర్తిస్తూ, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన థంబ్ నెయిల్స్ తో ప్రజల్లో మీడియాపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లకన్నా కూడా ఆంధ్రజ్యోతి స్థాయి దిగజారిందని వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలు, కోడిపందేలు వంటి అంశాలపై ఒక పక్షపాతంతో కథనాలు రాస్తూ.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సాంప్రదాయాన్ని ‘సుప్పిని శుద్దపూస’ లెక్క మహిళలపై, రాజకీయ నాయకుల కుటుంబాలపై, చివరకు దేవుళ్లపైనా అభ్యంతరకరమైన రాతలు, చిత్రాలను ప్రచురించడం మీడియా విలువలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి ధోరణి వల్లే తెలుగు మీడియా విశ్వసనీయత దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
CM Chandrababu: పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!
రాధాకృష్ణ రాజకీయ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ రాజకీయ లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నారని కారుమూరు వెంకట్‌రెడ్డి అన్నారు. మీడియా పేరుతో రాజకీయ దళారీ చేస్తూ, అమాయకులను మోసం చేయడం సరికాదని స్పష్టం చేశారు. నిజంగా జర్నలిజం విలువలు ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఉంటే, ఇలాంటి విషపూరిత కథనాలను ఎప్పుడో తిరస్కరించేవారని అన్నారు. సమాజంలో విషబీజాలు నాటేలా రాయడమే కాకుండా.. వాటిని ‘కొత్త పలుకు’ అంటూ సమర్థించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు తమ పరిధుల్లో ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, లేదంటే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని కారుమూరు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.