Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్‌తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్‌లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న…
Murshidabad Violence Report: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయని, హింసలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని పేర్కొంది. సహాయం కోసం పిలిచినప్పటికీ పోలీసులు స్పందించడంలో విఫలమైనట్లు నివేదిక తెలిపింది.
Spying: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు.
Turkey: పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది.
Mumbai: తల్లి అనే పదానికి మాయని మచ్చని తీసుకువచ్చింది ఓ మహిళ. తన ముందే, తన బిడ్డపై అత్యాచారం చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది. తన రెండున్నరేళ్ల కూతురు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో జరిగింది. నిందితుడు, సదరు మహిళ ప్రియుడిగా తేలింది. ఈ కేసులో ముంబై పోలీసులు రీనా షేక్ అనే మహిళతో పాటు, ఆమె లవర్ ఫర్హాన్ షేక్‌ని అరెస్ట్ చేశారు.
DMK: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య విమర్శలకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి, తన భర్త తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుడైన 40 ఏళ్ల వ్యక్తికి అధికార డీఎంకేతో సంబంధాలు ఉన్నాయి. ‘‘అతని పని 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం, అతను నన్ను పిచ్చి కుక్కలా కొరుకుతాడు’’ అంటూ ఆరోపణలు చేసింది.
Looting bride: వరసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, యువకుల్ని మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీ పట్టుబడింది. ఇప్పటివరకు ఈమె మొత్తం 25 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. అనురాధ పాశ్వాన్(32) అనే మహిళ నిత్య పెళ్లికూతురుగా మారింది. పెళ్లిళ్లు చేసుకుంటూ, వరుల వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదు దొంగలించి ఉడాయించడం ఈమె స్టైల్. మొత్తం 25 మంది పురుషులను వివాహాలు చేసుకుని మోసగించినట్లు తేలింది. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత, మరో పెళ్లి సమయానికి ఆమె తన పేరును, ఐడెంటిటీని మార్చుకుంటుంది.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన ఆమెను, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సంయుక్తంగా విచారిస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతి ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది.
Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.