Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని స్పష్టం చేశారు.. మీకు, ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు.. మీ మధ్యలోకి ప్రజా ప్రతినిధులను లాగొద్దని తెలిపారు.. మీడియా సంస్థల మధ్య ఇంట్రెస్ట్, పంచాయతీ మీరే చూసుకోవాలన్నారు.. మంత్రుల మధ్య పంచాయతీ పెడతాం అంటే కుదరదని.. తాము ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నామని.. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ఏ ఛానెల్ అయినా ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దని చెప్పారు.. సీఎం, మంత్రులు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం.. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు మమ్మల్ని ఏం చేయలేవన్నారు.. నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు.. ఎవరి కోసమో నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదని పేర్కొన్నారు.
READ MORE: Tamannaah : ఇంటిమేట్ సీన్ప్ విషయంలో.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన తమన్నా.