Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) జాన్ బోల్టన్, డొనాల్డ్ ట్రంప్ వాదనల్ని తోసిపుచ్చారు. మధ్యవర్తిత్వం ఆయన క్రెడిట్ తీసుకోవడంపై సెటైర్లు వేశారు. ‘‘ట్రంప్ బీయింగ్ ట్రంప్’’ అని ఆయన ‘‘ప్రతీదానికి క్రెడిట్ తీసుకుంటారు’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తీసుకున్న చర్యలు పూర్తిగా సమర్థనీయమని బోల్టన్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేసే హక్కు భారత్‌కి ఉందని అన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Read Also: KTR: “కాళేశ్వరాన్ని కూల్చింది వాళ్లే అని నా డౌట్..” మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై జాన్ బోల్టన్ మాట్లాడుతూ.. ‘‘ ఇది భారత్‌కి మాత్రమే సంబంధించింది కాదు, ఆయన ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు. ఇది ట్రంప్ విలక్షణమైన లక్షణం. ఎవరైనా క్రెడిట్ తీసుకునే ముందు ఆయన జోక్యం చేసుకుంటారు. ఇది చిరాకు కలిగించవచ్చు. ఇది భారత్‌కి వ్యతిరేకంగా కాదు, ట్రంప్ ట్రంప్ మాదిరిగానే ఉండటం మాత్రమే’’ అని అన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ, ఇది కలతపెట్టే సంకేతం అని అన్నారు. పాకిస్తాన్ అంతర్గత అసమ్మతిని అణచివేస్తోంది, ఇమ్రాన్ ఖాన్‌ని జైలులో ఉంచారు, ఇది చివరకు పాకిస్తాన్ సొంత ప్రయోజనాల కోసం కాదనేది నా భావన, దీనిపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన విషయం అని అన్నారు. భారత్ తన దౌత్య బృందాలను ప్రపంచ దేశాలకు పంపించడాన్ని ఆయన సమర్థించారు, ఉగ్రవాదం గురించి ప్రపంచదేశాలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.
#WATCH | Washington, DC: On President Donald Trump claiming credit for the ceasefire between India and Pakistan, former National Security Advisor of the United States, John Bolton says, "… It's nothing personal to India. This is Donald Trump, who takes credit for everything. I… pic.twitter.com/qVmZmzIK1N
— ANI (@ANI) May 21, 2025