Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని భయపెడుతున్న అంశం సింధు జల ఒప్పందం నిలిపివేత.
IndiGo Incident: బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విపరీతమైన వడగళ్ల వాన, దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న విమానం అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పైలట్లు విజయవంతంగా విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేయడంతో అందులోని 220 మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన వాతావరణం నుంచి బయటపడటానికి ఇండిగో పైలట్లు లాహోర్ ఏటీసీని సంప్రదించినప్పటికీ, పాకిస్తాన్ తమ ఎయిర్‌స్పేస్ ఉపయోగించుకోవడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ తీరు వల్ల 220 మంది ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది.
Airspace ban: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతల నిషేధాన్ని కేంద్రం జూన్ 23 వరకు, అంటే మరో నెల పాటు పొడగించింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు లీజు తీసుకున్న, వాటి యాజమాన్యం కింద నడపబడుతున్న విమానాలతో పాటు సైనిక విమానాలు భారత ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్ విధించారు.
Covid-19: దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హోస్కోటేకి చెందిన శిశువును మొదట ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆస్పత్రికి తరలించారు.
Imran Khan: పాకిస్తాన్లో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసిమ్ మునీర్‌కి ఇటీవల పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదవితో సత్కరించింది. యుద్ధంలో అసాధారణ వ్యూహాలు, సైనిక విజయాలు సాధించిన వారికి ఈ ప్రమోషన్ లభిస్తుంది. అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్‌కు బదులుగా తనను తాను "రాజు" అనే బిరుదును ఇచ్చుకోవాల్సిందని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు.
Mysore Pak: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల్ని, ముఖ్యంగా హిందువుల్ని మతం ఆధారంగా ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ దాడి తర్వాత దేశంలో ఒక్కసారిగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా భారత్, పాకిస్తాన్ భూభాగాలతో పాటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. 100కి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది.
India Pakistan: పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద భాష మారడం లేదు. భారత్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా, పాక్ ఎయిర్ ఫోర్స్ ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదులు మాట్లాడే భాషలోనే అక్కడి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్‌లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు.