హైదరాబాద్ కు చెందిన టెక్ పవర్డ్ కన్ స్ట్రక్షణ్ అగ్రిగేటర్ ఇటీవల వీహైజ్ బ్రాండ్ గా చేయబడింది. హోకోమోకో మొదటి ఫండింగ్ రౌండ్ లో యాంథిల్ వెంచర్స్, ఏంజెల్ ఇన్వెస్టర్ల గ్రూప్ నుంచి వన్ మిలియన్ యూఎస్ డాలర్లను సేకరించింది. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారత్ లోని ఇతర నగరాలకు విస్తరించడంలో ఈ నిధులను ఉపయోగించనుంది. వీహౌజ్ టెక్ అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్. ఇది ఎండ్ టూ ఎండ్ నిర్మాణ సేవలను సులభతరం చేస్తుంది. […]
భారత రాష్ట్రపతి పదవి అనేది ఎంతో కీలకం. దేశం మొత్తం పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. నిజానికి భారత ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతే అయినా.. వాస్తవంగా అధికారం చెలాయించేది ప్రధాని సారథ్యంలోని మంత్రి మండలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాష్ట్రపతికి విశేష అధికారాలను కల్పించింది భారత రాజ్యాంగం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారత రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణం […]
దేశంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. మరింతగా కఠినంగా చట్టాలను మార్చాలంటూ బాధితులు కోరుతూ ఉన్నారు. తాాజాగా మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఘోరం జరిగింది. కరాటే […]
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. దీంతో జూలై 24లోపే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. జూలై 25న భారత దేశానికి కొత్త రాష్ట్రపతి కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జూన్ 15న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల చివరి గడవు జూన్ 29గా సీఈసీ […]
ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టిన పాదయాత్ర గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది. అక్కడే అంకమ్మ దేవాలయాన్ని పున:ప్రారంభం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే గ్రామంలోని ప్రజల సమస్యలను వింటూ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరగిన సంఘటనపై రాష్ట్ర […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరగనుంది. చాలా మంది అభ్యర్థుల ఎప్పటి నుంచో టెట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ వచ్చే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు ఎన్సీఈఆర్టీ సెక్రటరీ రాధారెడ్డి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పని సరిగా ఓఎంఆర్ షీట్ లోని గడులను నింపడానికి తప్పకుండా నల్ల ఇంక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలని రాధారెడ్డి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విడుదల […]
బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఉదంతాలు ఎన్నో చూశాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బోరుబావిలో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరు బావుల్లో పడి మరణించారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉదంతాల్లో మరణించిన వారే ఎక్కువ. అతి తక్కువ శాతం మంది బతికి బయటపడి మృత్యుంజయులుగా నిలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేయడంతో 18 నెలల […]
టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. తాజాగా టికెట్ రేట్లను మరోసారి పెంచింది. డిజిల్ సెస్ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరుగుతున్న డిజిల్ ధరలు, నష్టాలు ఆర్టీసీని కుదేలు చేస్తున్నాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరోసారి ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనపు డిజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ భావించింది. అయితే తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్ లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ లో […]
పులి కనిపిస్తే చాలు చాలా వరకు పక్షలు, జంతువులు దాని సమీపంలో ఉండేందుకు ప్రయత్నించవు. కానీ దానికి భిన్నంగా ఓ బాతు మాత్రం పులిలో దాగుడుమూతలు ఆడింది. ఆకలితో ఉన్న పులి బాతుపై అటాక్ చేయడానికి రావడంతో వెంటనే నీటిలో మునిగిపోతూ పులికి మస్కా ఇచ్చింది. ఓ కొలనులో ఉన్న పులి నేర్పుతో, ఓపికగా, నిదానంగా బాతుపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బాతు నీటిలో మునిగిపోతుంది. దీంతో పులి అయోమయానికి గురై అటూ ఇటూ చూసుకుంటుంది. […]
తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫార్మ్ హౌజ్ కే పరిమితం అవుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీతక్క టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. స్థానిక సమస్యలను పట్టించుకోకుడా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు పలుకుతూ టైంను కేటాయిస్తున్నారని విమర్శించారు. […]