12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HUAWEI MatePad Air (2026): హువావే (HUAWEI) నుండి కొత్తగా MatePad Air (2026) ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్లో 12-అంగుళాల 2.8K OLED PaperMatte డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, కొత్త Kirin T93C ప్రాసెసర్, 10100mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ముఖ్యంగా గత మోడల్లో ఉన్న LCD డిస్ప్లే స్థానంలో OLED ప్యానెల్‌ను అందించడం ఈ ట్యాబ్లెట్‌కు ప్రధాన అప్‌గ్రేడ్.
HUAWEI MatePad Air (2026)లో 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గామట్, 1200 నిట్స్ HDR పీక్ బ్రైట్నెస్, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. కేవలం 4.6mm అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే PaperMatte కోటింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌కు కొత్త Kirin T93C ప్రాసెసర్‌ను అమర్చారు. 8GB లేదా 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. HarmonyOS 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డివైస్‌లో 6 స్పీకర్లు ఉండటంతో మెరుగైన ఆడియో అనుభవం లభిస్తుంది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
ఫోటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరాను కొనసాగించగా.. వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్, కంటెంట్ క్రియేషన్‌కు ఈ ట్యాబ్లెట్ మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఇందులో10100mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ ట్యాబ్లెట్ కేవలం 5.2mm మందం, 509 గ్రాముల బరువుతో స్లిమ్, తేలికైన డిజైన్‌లో వస్తుంది.
ఈ ట్యాబ్లెట్లో Wi-Fi 7, Bluetooth 5.2, USB Type-C (USB 3.1 Gen1), LDAC, AAC ఆడియో సపోర్ట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా Huawei స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డు, M-పెన్సిల్ ప్రో యాక్సెసరీలకు కూడా సపోర్ట్ అందించారు. ప్రస్తుతం లైట్ బ్లూ, చెర్రీ బ్లోసమ్ పింక్, ప్యూర్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. యూరప్‌లో ఈ ట్యాబ్లెట్‌కు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 1 నుంచి షిప్పింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్‌లో విడుదలపై హువావే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వీటి ధర విషయానికి వస్తే..
* 8GB + 256GB (స్టాండర్డ్ వెర్షన్ + కీబోర్డ్) – 849 యూరోలు (రూ.93,065)
* 8GB + 256GB PaperMatte Edition – 899 యూరోలు (రూ.98,550) – కీబోర్డ్ లేదా M-Pencil Proతో
* 12GB + 256GB – 999 యూరోలు (రూ.1,09,510) – కీబోర్డ్‌తో.
PSA: This unboxing may defy gravity. ☁️ The new #HUAWEIMatePad Air is so light, it belongs in the air. #NowIsYourMoment pic.twitter.com/4JOeg9sGVg
— Huawei Mobile (@HuaweiMobile) July 15, 2026
A lightweight design. Minimalist architecture. Meet the all-new #HUAWEIMatePad Air, built for those who value both self-expression and efficiency. #FreshAirYourSpark pic.twitter.com/caQtgvEO6n
— Huawei Mobile (@HuaweiMobile) July 14, 2026
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!