Pakistan’s New Army Chief Is Lieutenant General Asim Munir: దాయాది దేశం పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను గురువారం నియమించింది పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ నెలఖారులో ప్రస్తుత సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ బాధ్యతలను తీసుకోనున్నారు. గత ఆరేళ్లుగా పాక్ సైన్యాధ్యక్షుడిగా బజ్వా అన్నారు. మునీర్ గతంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చీఫ్ గా పనిచేశాడు. అయితే మునీర్ నియామకంపై గతంలో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతోనే ఆయన్ను సైన్యం పదవి నుంచి దించేసినట్లు ఊహాగానాలు ఉన్నాయి.
Read Also: Amazon: “ఆన్‌లైన్ లెర్నింగ్ అకాడమీ”కి గుడ్ బై చెప్పిన అమెజాన్.
మునీర్ నియామకం తర్వాత రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది మెరిట్, చట్టం, రాజ్యాంగం ప్రకారం జరిగిందని అన్నారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కన్నా సైన్యానిదే కీలక పాత్ర. అక్కడ సైన్యం చెప్పినట్లే ప్రజాస్వామ్యం నడుస్తుంది. ప్రస్తుం పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో కొత్త సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్, అమెరికా, చైనా, పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇలా అన్నింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు కూడా కీలకంగా కానున్నాయి. ఇక ఇండియాతో పాక్ కొత్త ఆర్మీ చీఫ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
బుధవారం మాట్లాడిన ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో సైన్యం పాత్ర ఉండదని ఆయన అన్నారు. యూఎస్ మద్దతుతో సైన్యం కుట్ర చేసిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మరోవైపు, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిజెసిఎస్‌సి) ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాని నియమించారు.