Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టెమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా ఓరియన్ తన మొదటి మూన్ ఫ్లైబైని విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం జరిగిన ఆరు రోజుల తర్వాత ఓరియన్ వ్యోమనౌక తన నాలుగో కక్ష్య సవరింపులను చేసుకుంది. ఓరియన్ లోని ఆక్సిలరీ ఇంజిన్‌లను ఉపయోగించి చంద్రుడి సుదూర తిరోగమన కక్ష్యలోకి మారేందుకు కావాల్సిన విన్యాసాలను చేసింది. ఈ కక్ష్య ఓరియన్ కు మరింత స్థిరత్వాన్ని అందిస్తుందని నాసా వెల్లడించింది. ఈ కక్ష్యలో ఉండటానికి తక్కువ ఇంధనం ఖర్చవుతుందని తెలిపింది.
Read Also: Uttar Pradesh: మేము అధికారంలోకి వస్తే “మీరట్” పేరును “నాథూరామ్ గాడ్సే నగర్”గా మారుస్తాం.
Also Read
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
- TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
- OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ఓరియన్ నవంబర్ 25 చంద్రుడికి అత్యంత సుదూర బిందువును దాటి 57,287 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. గతంలో అపోలో 13 నెలకొల్పిన రికార్డును అధిగమించనుంది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఓరియన్ భూమి నుంచి 2,16,842 మైళ్లు ప్రయాణించింది, ప్రస్తుతం చంద్రుడి నుండి 13,444 మైళ్ల దూరంలో ఉంది. గంటకు 3,489 మైళ్ల వేగంతో ప్రయాణించి భూమి నుంచి చంద్రుడి వద్దకు చేరింది. ఆర్టెమిస్-1 నాసా స్పేస్ లాంచింగ్ సిస్టమ్స్(ఎస్ఎల్ఎస్) ఇంటిగ్రేటెడ్ రాకెట్ తొలి ప్రయోగం. వ్యోమగాములు లేకుండా ఓరియన్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని చేపట్టింది. పలుమార్లు వాయిదా పడినప్పటికీ గతం వారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది నాసా.
చివరి సారిగా 1972లో వ్యోమగాములతో అపోలో-17 మిషన్ మూన్ మిషన్ ని నాసా చేపట్టింది. ఆ తరువాత 2025లో వ్యోమగాములతో కూడిన మూన్ ల్యాండింగ్ మిషన్ ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. ఈ ప్రయోగంలో ఓ మహిళ ఆస్ట్రోనాట్ కూడా ఉండనున్నట్లు నాసా వెల్లడించింది. ఇదే జరిగితే చంద్రుడిపై కాలుపెట్టిన తొలి మహిళగా రికార్డుకెక్కే అవకాశం ఉంటుంది. ఆర్టిమిస్-1 మానవ చంద్రుడి అంతరిక్ష యాత్రకు పునాది వేస్తుందని నాసా భావిస్తోంది.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!