Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
- తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి
- మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
- ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై బ్రూక్ నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Reaction on England Defeat vs India in 1st ODI: మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో కీలక సమయంలో వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడమే తమ పరాజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. రెండో వన్డేలో మరింత బలంగా తిరిగి వస్తామని, టీమిండియాపై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
‘మొదటి వన్డేలో మా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దశలోనే మ్యాచ్‌పై మేము పట్టును కోల్పోయాం. అయినప్పటికీ చివర్లో జో రూట్, లియామ్ డాసన్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా తీసుకెళ్లారు. చివర్లో వచ్చిన చిన్నచిన్న భాగస్వామ్యాలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ పరిస్థితుల్లో 260 పరుగులు చేయడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ రూట్, డాసన్లకే దక్కుతుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పాడు.
Also Read
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
‘260 పరుగుల లక్ష్యాన్ని మా బౌలర్లు కాపాడగలమనే నమ్మకం ఉంది. ఇన్నింగ్స్ విరామ సమయంలో పిచ్ కొంత నెమ్మదించింది. అదే పరిస్థితి కొనసాగితే మా బౌలర్లకు అనుకూలంగా మారుతుందని అనుకున్నాం. కానీ భారత బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఐదు నుంచి ఆరు పరుగుల రన్‌రేట్‌తో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. పిచ్ స్వభావం మారడంతో మా వ్యూహాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మేము ఎప్పుడూ పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తాం. ఈ మ్యాచ్‌లో మరో 60-70 పరుగులు చేసి 320 లేదా 330 స్కోరు సాధించి ఉంటే మా స్పిన్నర్లు మ్యాచ్‌లో మరింత ప్రభావం చూపేవారు. కానీ మిడిల్ ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. అదే మా ఓటమికి ప్రధాన కారణం’ అని అన్నాడు.
రెండో వన్డేకు ముందు ఆందోళన ఏమీ లేదని బ్రూక్ స్పష్టం చేశాడు. ‘ఇప్పుడు మేము కార్డిఫ్‌కు వెళ్తాం. అక్కడ పిచ్‌ను పరిశీలించి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటాం. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకుని రెండో వన్డేలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. కచ్చితంగా టీమిండియాను ఓడించడానికే చూస్తాం. సిరీస్‌ను సమం చేయడానికి ప్రయత్నిస్తాం’ అని హ్యారీ బ్రూక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?