9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI Note 17 Pro Launch: చైనాలో షియోమీ (Xiaomi) REDMI Note 17 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 9000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, అత్యున్నత IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది.
1.5K AMOLED డిస్ప్లే:
REDMI Note 17 Proలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3200Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, HDR10+, 12-bit కలర్ డెప్త్‌కు మద్దతు ఇస్తుంది. గరిష్టంగా 3200 నిట్స్ బ్రైట్నెస్ అందించడంతో పాటు “గ్రీన్ మౌంటెన్ ఐ ప్రొటెక్షన్” టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. చీకటి వాతావరణంలో స్క్రీన్ బ్రైట్నెస్ను 1 నిట్ వరకు తగ్గించే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో అందించారు.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
9000mAh బ్యాటరీ:
ఈ ఫోన్లో 4nm Qualcomm స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 8GB/12GB LPDDR4X ర్యామ్, గరిష్టంగా 512GB స్టోరేజ్ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉంది. REDMI Note 17 Proలో 9000mAh భారీ బ్యాటరీ హైలెట్. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. REDMI Note 17 Proతో షియోమీ ప్రత్యేకంగా 5 సంవత్సరాల బ్యాటరీ అప్‌గ్రేడ్ వారంటీను ప్రకటించింది. మొదటి 4 సంవత్సరాల్లో బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తక్కువకు పడిపోతే ఉచితంగా కొత్త బ్యాటరీ అందిస్తారు. 5వ సంవత్సరంలో బ్యాటరీ 80% కంటే తక్కువకు చేరితే, మరింత అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తామని కంపెనీ తెలిపింది.
కెమెరా & ప్రొటెక్షన్:
ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ లభించాయి. దీనితో దుమ్ము, నీరు, అధిక పీడనంతో వచ్చే వాటర్ జెట్లను కూడా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. REDMI Note 17 Proలో Android 16 ఆధారిత HyperOS 3, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, NFC, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, USB టైపు-C, 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు:
REDMI Note 17 Pro ప్రస్తుతం చైనా మార్కెట్లో స్కై బ్లూ, నెబుల పర్పుల్, బ్లాక్, వైట్ రంగుల్లో అమ్మకాలకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. భారత్‌లో లాంచ్ తేదీపై షియోమీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
* 8GB + 128GB – 1,599 యువాన్ (రూ.22,690).
* 8GB + 256GB – 1,899 యువాన్ (రూ.26,945).
* 12GB + 256GB – 2,199 యువాన్ (రూ.31,200).
* 8GB + 512GB – 2,299 యువాన్ (రూ.32,620).
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!