హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలికపై తల్లి కర్కషంగా వ్యవహరించారు. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రని ఎండకు డాబాపై పడుకోబెట్టింది. పైన ఎండ, కింద డాబా వేడికి చిన్నారి విలవిల్లాడింది. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని తుఖ్ మీర్ పూర్ ప్రాంతంలోని కర్వాల్ నగర్ లో చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక హోం వర్క్ చేయనుందకు 5-7 […]
మరో ఆసియా దేశం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే శ్రీలంక దారిలోనే దాయాది దేశం పాకిస్తాన్ పయణిస్తోంది. తాజాగా ఆ దేశంలో కరెంట్ ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ఎంతలా విద్యుత్ ఆదా చేసేందుకు పెళ్లి వేడులకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత వివాహ వేడుకలను నిషేధించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం భారీగా ఉంది. జూన్ 8 నుంచి ఈ నిషేధం […]
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి […]
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని […]
తెలంగాణలో భయానక వాతావరణం నెలకొందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ముఖ్యమంత్రి, మంత్రులు మీ ఆఫీసులకు ఎప్పుడు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్ అయిందని.. లా అండ్ ఆర్డర్, పరిపాలనలో, హామీల అమలులో విఫలం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రూ.109 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బులను […]
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని […]
దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను అమలులోకి తెచ్చినా కూడా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు బరి తెగిస్తున్నారు. ఢిల్లీలో నిర్భయ […]
ఇటీవల తెలంగాణలో జరుతున్న వరస అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహిళా కాంగ్రెస్ నేతలు మౌనదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ అత్యాచార ఘనటలో బాధితురాలని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలని పోలీసులు హౌజ్ అరెస్ట్ […]
తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని మంత్రి హరీష్ రావు బీజేేపీ పార్టీపై ఫైర్ అయ్యాడు. నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు […]
భద్రాద్రి రాముడిని వదలడం లేదు కొంతమంది ఆగంతకులు. రామాలయం ప్రతిష్ట దిగజార్చేలా సోషల్ మీడియాలో ఆశ్లీల చిత్రాలు పెట్టారు. సాక్షాత్తు భద్రాచలం ఆలయం విశిష్టతను వివరించే ఫేస్ బుక్ పేజీలోకి మెక్సికో దేశానికి చెందిన హ్యకర్లు చొరబడ్డారు. పేజీలో అశ్లీల చిత్రాలు పెట్టారు. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు దేవుడిని అవమానపరిచారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై నిర్వాహకులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా.. తమ పేరుపై ఎలాంటి ఫేస్ […]