Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఆయన్ను ఓ మంచి తండ్రిగా, తాతగా, మంచి వ్యక్తిగా ఈ సమాజం పేర్కొనడం విశేషం.
‘ బీస్ట్ ఆఫ్ బోండి’ అని పోలీసుల చేత పిలువబడే సీరియల్ రేపిస్ట్ కీత్ సిమ్స్ 1985-2001 మధ్య అనేక మంది మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలు చేశాడు. జాగింగ్ కు వెళ్లే సమయంలో వారి ఇళ్లలోకి ప్రవేశించి, వారిపై దాడికి పాల్పడి అత్యాచారం చేసేవాడు. అయితే మొదట్లో ఈ నేరాలకు వేర్వేరు వ్యక్తుల కారణం అని పోలీసులు భావించారు. అయితే బాధితులు మాత్రం ఒకే రకమైన ఆధారాలు చెప్పడంతో ఇది ఓ సీరియల్ రేపిస్టు పనేనని ధృవీకరించుకున్నారు. ఈ కోణంలో సీరియల్ రేపిస్టుపై 2000 సంవత్సరంలో విచారణ ప్రారంభించారు. నిందితుడు ఫిబ్రవరిలో 66 ఏళ్ల వయసులో మరణించారు. నిందితుడు మరణించిన తర్వాత ఆయన నేరానికి పాల్పడింది అతడే అని పోలీసులు గుర్తించారు. తన భర్త రేపిస్టు అన్న సంగతిని ఇప్పటికే కీత్ సిమ్స్ భార్య నమ్మకలేకపోతోంది.
Read Also: Bombay High Court: విడాకుల కోసం భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం.. కోర్టు ఏం చేసిందంటే.?
డీఎన్ఏ టెక్నాలజీతో పట్టుబడ్డాడు:
14-55 ఏళ్ల మధ్య ఉన్న అత్యాచార బాధితులు అంతా దుండగుడి గురించి ఒకే రకమైన వివరాలు ఇచ్చారు. నిందితుడు సాధారణ దుస్తులు ధరించడంతో పాటు ముఖాన్ని కప్పి ఉంచుకునే వాడని బాధితులు వెల్లడించారు. ముదురు రంగులో ఉన్నాడని.. తనతో ఒక కత్తితో ఉందని, కత్తితో బెదిరించి అత్యాచారాలకు పాల్పడే వాడని తెలిపారు. ఈ వివరాల వల్ల వేల సంఖ్యలో ఉన్న అనుమానితులను చివరకు పోలీసులు 324 మందికి తగ్గించారు. పోలీస్ డేటాబేస్ లో ఉన్న డీఎన్ఏ వివరాలతో సిమ్స్ నమూనాలు సరిపోలడంతో కేసు చిక్కుముడి వీడింది.
మూడు దశాబ్ధాలుగా సిడ్నీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని గుర్తించారు. విషయం ఏంటంటే అతడిని కనుకునే సమయానికి అతడు మరణించడం కొసమెరుపు. 1985లో ప్రారంభం అయిన నిందితుడి నేర చరిత్ర 2001 వరకు కొనసాగింది. చివరిసారిగా స్థానిక శ్మశానవాటిక సమీపంలో నేరానికి పాల్పడ్డాడు.