బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై దేశం ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా బీజేపీ తీరును పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇదిలా ఉంటే ఖతార్, యూఏఈ, లెబనాన్, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి పలు ముస్లిం దేశాలు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై భారత్ […]
దేశంలో తొలిసారిగా జంతువుల కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చారు. పూర్తిగా దేశీయంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. హర్యానాకు చెందిన ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ అభివృద్ధి చేసిన ‘అనోకోవాక్స్’ను కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ప్రారంభించారు. అనోకోవాక్స్ జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాక్సిన్. క్రియారహితం చేసిన సార్స్ కోవ్ 2 డెల్టా వ్యాక్సిన్. అనోకోవాక్స్ జంతువుల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని.. దీంతో డెల్టా, ఓమిక్రాన్ […]
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా ఏర్పడిన ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని దీంతో రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. రాబోయే రెండు రోజులు గోవా, కర్నాటకతో పాటు దక్షిణ ఏపీలోని […]
భారత్ తో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ఇండియాలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దాదాపుగా 3 నెలల తరువాత గరిష్ట స్థాయికి కేసుల సంఖ్య చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో గురువారం కొత్తగగా 622 […]
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో […]
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు. కేసీఆర్ […]
పాకిస్తాన్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతూనే ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు, హిందూ అమ్మాయిలను అపహరించుకుని వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం, అత్యాచారాలకు పాల్పడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో అక్కడ మైనారిటీ హిందువులకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. గతేడాది అక్టోబర్ నెలలో కొత్రిలోని సింధు నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తాజాగా బుధవారం రోజు పాక్ లో మరో […]
ప్రముఖ పాకిస్తాన్ టెలివిజన్ హెస్ట్, పాక్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు అమీర్ లియాఖత్ (49) కరాచీలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పాక్ మీడియా గురువారం తెలిపింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ( పీటీఐ) పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. గతంలో పలు కీలక స్థానాల్లో పనిచేశారు. కరాచీలోని ఖుదాద్ కాలనీలోని అతని ఇంటిలో అపస్మారక స్థితిలో అమీర్ లియాఖత్ హుస్సెన్ కనిపించారు.. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే బుధవారం రాత్రి నుంచే […]
రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిల పక్షంతో చర్చిద్దాం అని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా నేనే వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ […]
జూబ్లీహిల్స్ అమ్మాయి అత్యాచారం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నారు. గురువారం కేసులో కీలకంగా ఉన్న మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. దాదాపుగా 5 గంటలు పాటు విచారణ కొనసాగింది. ఫోన్ సీడీఆర్ డేటా, సీసీ కెమెరా ఫులేజ్ ను ముందుపెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాదుద్దీన్ మాలిక్ కు మైనర్లతో ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులే కాకుండా ఇతర వ్యక్తుల […]