కొన్నేళ్ళుగా తన కొరియోగ్రఫీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బృందా మాస్టర్. అయితే తొలిసారి ఆమె మెగా ఫోన్ చేతపట్టి తీసిన ‘హే సినామిక’ ఈ యేడాది మార్చిలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో మరోసారి దర్శకురాలిగా మరో జానర్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలని బృందా మాస్టర్ భావిస్తోంది. ‘కన్యాకుమారిలో థగ్స్’ అనే […]
చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని […]
శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరాటే కల్యాణి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన హిందూ సంఘం ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై హిందువులంతా ఏకమై న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 100 కోట్ల మంది హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు […]
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన […]
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీకి […]
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 78 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలతో, ఆరోగ్యం క్షీణించడంతో దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ముషారఫ్ ను చూసేందుకు ఆయన బంధువులు పాక్ నుంచి దుబాయ్ వెళ్లారు. 1999 నుంచి […]
గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాన్పూర్ లో హింస చెలరేగింది. కొంతమంది రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం కాన్పూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ […]
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ […]
తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే […]
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు. ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్ […]