Monsoon Session of Parliament: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నేడు పార్లమెంట్ లో అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి వారి ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, రాష్ట్రీయ లోక్‌దళ్ ఎంపీ జయంత్ చౌదరి, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం తంబి దురై, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవరావు, […]
Elon Musk sent warning to twitter CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చినప్పటి నుంచి ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కొనుగోలు ఒప్పదంలో అనేక ఉల్లంఘనల కారణంగా మస్క్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్విట్టర్, ఎలాన్ […]
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
COVID CASES IN INDIA: కోవిడ్ విజృంభన తగ్గడం లేదు. వరసగా కొన్ని రోజులుగా దేశంలో రోజూవారీ కేసులు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా నెలన్నర కాలంగా రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా నమోదు అవుతోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. వరసగా నాలుగు రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలవరపరుస్తోంది. ఫోర్త్ వేవ్ కు దారితీస్తుందా […]
IndiGo Sharjah-Hyderabad flight: ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం కారణంగా పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. యూఏఈ షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సమీపంలో ఉన్న కరాచీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. ఇండిగో ఫ్లైట్ 6ఈ-1406 విమానం షార్జా నుంచి బయలుదేరిన కొంత సేపటికి పైలెట్లు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు.
రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.
Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కు సర్వం సన్నద్ధమైంది. ప్రతీ సంవత్సరం నీట్ ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్మర్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 13 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..తెలంగాణ నుంచి 60 వేల మంది ఉన్నారు.
Heatwave in Europe: యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యూకేలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు పలు దేశాల్లో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. తాజాగా శనివారం ఫ్రాన్స్, స్పెయిన్ అడవుల్లో మంటలు చెలరేగాయి. వేసవి కాలంలో పెరుగుతున్న హీట్ వేవ్ కారణంగానే కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. నైరుతి ఫ్రాన్స్,
యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు. ‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక […]