ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. […]
దేశంలో అక్షరాస్యత, ఉత్తమమైన గ్రామ పంచాయతీ వ్యవస్థతో పాటు టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగంలో ముందు వరసలో ఉంటుంది కేరళ రాష్ట్రం. తాజాగా మరో ఘనత సాధించింది కేరళ. దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేరళలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి విజయన్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఇంటర్నెట్ […]
1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ప్రధాన నిందితుడనే ఆరోపణలు ఉన్న రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్న దుండగుడు కాల్చిచంపాడు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధి లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా […]
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్, […]
కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం […]
ఇండియాలో మరోసారి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు అయింది. ఇటీవల బ్రిటన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన మిడ్నాపూర్ వాసికి ఒళ్లంతా దద్దర్లతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేరడం ఆందోళన పెంచింది. అయితే తాజాగా మరో అనుమానిత కేసు కేరళలో నమోదు అయింది. గతంలో కూడా నిఫా, కరోనా వంటి కేసులు ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఇటీవల కేరళలోకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార బీజేపీని ఎదుర్కోవడానికి మాటల యుద్ధానికి పనిచెప్పడానికి విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నాయి. చాలా సార్లు పార్లమెంట్ సమావేశాల్లో వాడీవేడీ చర్చల సందర్భంగా సభ్యులు కొన్ని పదాలను వాడుతుంటారు. అయితే అవి అభ్యంతరకర పదాలు, వ్యాఖ్యలు అయితే సభ రికార్డుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ పదాల నిషేధంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్రుణమూల్ ఎంపి డెరిక్ […]
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా సరీసృపాల ఆవాసాలైన పుట్టలు, బొరియలు వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. కీటకాలు, పాములు వంటి వాటికి పాత వస్తువులు, చీకటి ప్రాంతాలు ఆవాసంగా మారుతున్నాయి. ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సేఫ్ ప్లేసులను ఎంచుకుంటున్నాయి పాములు. తాజాగా ఓ నాగుపాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడా చోటు దొరకనట్లుగా ఓ నాగుపాము షూ లో దూరింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ […]
లింగ సమానత్వ సూచీలో ఇండియా పూర్ ఫెర్ఫామెన్స్ కనబరిచింది. చివరి వరసలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లింగ సమానత్వ సూచీ 2022( జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022)లో పొరుగు దేశాల కన్నా వెనకబడి ఉంది. మొత్తం 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. మన తర్వాత మరో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక(110), మాల్దీవులు (117), భూటాన్ (126) కన్నా ఇండియా వెనకబడి […]
కెనడాలో జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. కొంతమంది దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా.. అసభ్యరీతిలో రాతలు రాశారు. ఈ ఘటనను కెనడాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. విద్వేశపూరిత నేరం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెనడా ఒంటారియోలోని రిచ్మండ్ హిల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యోగంగే స్ట్రీల్, గార్డెన్ అమెన్యూ ప్రాంతంలోని విష్ణు మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనలపై […]