చెన్నై విమానాశ్రయంలో ఏకంగా ‘ వీడొక్కడే ’ సినిమా సీన్ రిపీట్ అయింది. సినిమాలో డ్రగ్స్ ను క్యాప్సుల్స్ లో పెట్టి కడుపులో దాచిన సన్నివేశం ఉంటుంది. సరిగ్గా అలాగే టాాంజానియా నుంచి వస్తున్న వ్యక్తి కడుపులో రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్ కనుగొన్నారు. మొత్తం 86 క్యాప్సుళ్లను కడుపులో దాచాడు. చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడుపులో ఉన్న డ్రగ్స్ గుట్టు తెలిసింది.
తమిళనాడు వ్యాప్తంతా 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇటీవల శ్రీలంక నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై నమోదైన కేసుపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై. తిరుప్పూర్, చెంగల్పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లంక డ్రగ్ మాఫియా సంబంధాల గట్టును కనుక్కునేందుకు ఎన్ఐఏ ఈ రైడ్స్ నిర్వహించింది.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ జాతీయ హోదా కల్పించాలని కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని ఆయన వెల్లడించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు స్కీంలో చేర్చడానికి అర్హత…
Supreme Court On Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీల్ ను అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు హిందూ మహిళలు వేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం జ్ఞానవాపి మసీదు కేసును విచారించింది. ప్రస్తుతం ఈ […]
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రశ్నించింది. గతంలోనే సోనియా గాంధీకి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా.. కరోనా బారిన పడిన కారణంగా ఆ సమయంలో సోనియా గాంధీ హాజరుకాలేదు. తాజాగా గురువారం రోజున ఈడీ సోనియాగాంధీని 3 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తున్నా.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఎంపీల ఓట్ల లెక్కింపుతో తొలి రౌండ్ ముగిసింది. ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీగా ఓట్లను సాధించారు. ద్రౌపది ముర్ము 540 మంది ఎంపీల మద్దతులో 3,78,000 విలువను సాధించారు.
దేశంలో సంచలనం రేపిన నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దాడి జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు
Estimated flood damage in Telangana: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, భవణాలు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల […]
UK PM race..Rishi Sunak wins 5th round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. యూకే ప్రధాని పీఠానికి మరో అడుగుదూరంలో రిషి సునక్ ఉన్నారు. ఈ ఘట్టాన్ని దాటితే యూకేకు తొలి భారత సంతతి ప్రధానిగా రిషి సునక్ చరిత్రకెక్కనున్నారు. వరసగా ఐదు రౌండ్లలో విజయం సాధించారు. తాజాగా బుధవారం జరిగిన ఐదో రౌండ్లో కూడా రిషి సునక్ గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని పీఠం కోసం ఎవరితో […]
Telangana Liberation Day on September 17: తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని భారీగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17వరకు ఏడాది పాటు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలపబడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది బీజేపీ పార్టీ. 2023 సెప్టెంబర్ 17న […]