Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండో రోజున పెద్దఎత్తున సందర్శకులు
- స్టాళ్లకు భారీగా సందర్శకులు
- కల్చరల్ హెరిటేజ్–టూరిజంపై సదస్సు
- వక్తల విలువైన విశ్లేషణలు
- 27కి పైగా స్టాళ్లకు విశేష ఆదరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (గురువారం) పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను దర్శించడానికి బారులు తీరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు “డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్–జెన్ టూరిజం” అనే అద్భుతమైన సదస్సుతో ప్రారంభమైంది.
Narendra Modi : తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వీరు వివరించారు. ఈ సదస్సులో డా. మామిడి హరి కృష్ణ, బిరద్ రాజారామ్, పి. పద్మావతి, గోపీ బైల్లుప్పాల లు పాల్గొని మాట్లాడారు. అనంతరం, తెలంగాణ రైజింగ్- ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్ అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా చేపట్టిన ప్రగతిని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్,,కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి,చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ చెదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు,డ్రోన్స్ , రోబో తదితర 27 కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు ఈ గ్లోబల్ సదస్సు ను సందర్సించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.
Mamata Banerjee: ‘‘BSF పోస్టుల వద్దకు మాత్రం వెళ్లకండి’’.. SIRపై మమతా సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..