Heatwave in Europe: యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యూకేలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు పలు దేశాల్లో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. తాజాగా శనివారం ఫ్రాన్స్, స్పెయిన్ అడవుల్లో మంటలు చెలరేగాయి. వేసవి కాలంలో పెరుగుతున్న హీట్ వేవ్ కారణంగానే కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. నైరుతి ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఏర్పడిన కార్చిచ్చును ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 1200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బందిని మంటలు అదుపుచేసేందుకు ఏర్పాటు చేశారు. కార్చిచ్చు కారణంగా ఫ్రాన్స్ లోని గిరోండే ప్రాంతం నుంచి 14,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గడిచిన వారాల్లో ఫ్రాన్స్ తో పాటు పోర్చుగల్, స్పెయిన్ ఇతర యూరోపియన్ దేశాల్లో అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా ఫ్రాన్స్ లో ఏర్పడిన కార్చిచ్చు కారణంగా గిరోండే ప్రాంతంలో 25,000 ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మరోవైపు ఫ్రాన్స్ దేశంలో ఉష్ణోగ్రలు పెరిగిపోతున్నాయి. తాజాగా మొత్తం దేశంలోని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. 96 ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతోంది.
Read Also: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్‌లోనూ ముందంజ
యూరప్ వ్యాప్తంగా గత వారం వ్యవధిలో వడగాలుల కారణంగా 360 మంది మరణించారు. ఉత్తర యూరప్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న మలానా ప్రావిన్స్ లోని మిజాస్ పట్టణానికి సమీపం వరకు కార్చిచ్చు వ్యాపించింది. దీంతో 3000 మంది ప్రజలను అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారెు. ఇక స్పెయిన్ లో కూడా అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు.
ఇక బ్రిటన్ లో భారీగా ఎండలు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఎమర్జెన్సీతో పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించింది అక్కడి వాతావరణ శాఖ. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో.. అధికారులు వరసగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చివరి సారిగా బ్రిటన్ లో రికార్డు స్థాయిలో 38.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత 2019లో కేంబ్రిడ్జ్ లో నమోదు అయింది.