CM Yogi Adityanath’s sensational decision: సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. యోగీ చరిష్మాతో యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సంచనల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఉత్తర్ ప్రదేశ్ లో మత కలహాలకు చెక్ పెట్టడంతో పాటు క్రైం రేట్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో డెవలప్మెంట్ ను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం యూపీలో ఆగస్టు 15కి సెలవును రద్దు చేసింది యోగీ సర్కార్.
Read Also: Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్
ఇంతకు దీనికి అసలు కారణం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావడమే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని యోగీ సర్కార్ భావించింది. గతంలో ఆగస్టు 15 రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జెండా ఎగరవేసి, చిన్న చిన్న కార్యక్రమాలతో వేడుకలను ముగించకుండా.. ప్రతీ ఒక్కరు తమ కార్యాలయానికి విధిగా హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సూచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు యూపీ సీఎస్ డీఎస్ మిశ్రా తెలిపారు. సాధారణంగా క్లీనింగ్ డ్రైవ్ దీపావళి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ సారి దీన్ని జాతీయ కార్యక్రమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటుంది యూపీ సర్కార్.