టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉంటే అందులో 696 అంటే సుమారుగా 15 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం అక్కడి మహిళల పాలిట నరకంగా మాారాయి. నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డలు, తమను నమ్ముకుని ఉన్నవారి ఆకలి తీర్చేందుకు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అక్కడి ఆర్థిక సంక్షోభం శ్రీలంక మహిళలను దీనస్థితిలోకి నెట్టేశాయి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిన తరువాత వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు.
Clash between TRS and BJP parties in Mancherial district: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగాయి. కర్రలు, చెప్పులతో రెండు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన తెలియజేస్తుంటే.. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపాయి. మంచిర్యాల […]
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు విపత్తుల సహయ నిధుల కింది రూ. 3000 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఇందులో 2018 నుంచి రూ. 1500 కోట్లు విడుదల చేసిందని గణాంకాలతో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇండియాలో వరసగా పలు సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గాల్లో ఉండగానే విమానాాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో సంఘటన జరిగింది. గో ఫస్ట్ సంస్థకు చెందిన ఏ 320 నియో విమానం గాల్లో ఉండగానే ఫ్లైట్ అద్దాల పగిలిపోయింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే విమానాాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.
Siddu Musewala murder case: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులకు, పోలీసులు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం అమృత్సర్ జిల్లాలోని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అట్టారీ బార్డర్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్ నగర్ గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో సిద్దూ మూసేవాలా హత్యతో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్స్టర్స్ జగ్రూప్ సింగ్ రూపం, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్నూ కుస్సాను […]
Rajat Kumar Comments on polavaram project: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వల్ల కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ అయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొంతమంది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. 18 సంస్థలు చూసిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత ప్రాజెక్టులు కడతారని ఆయన అన్నారు. కడెం, […]
జపాన్ దేశ పాస్పోర్ట్ ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ గా నిలువగా.. ఆ తరువాతి స్థానాల్లో వరసగా సింగపూర్, సౌత్ కొరియా, స్పెయిన్, ఫిన్లాండ్, ఇటలీ, లెక్సెంబర్గ్, ఆస్ట్రియా, డెన్మార్క్ దేశాలు తరువాతా స్థానాల్లో నిలిచాయి. జపనీస్ పాస్పోర్ట్ ద్వారా 193 దేశాలకు అవంతరాలు లేకుండా వెళ్లేందుకు ప్రవేశాన్ని కల్పిస్తోంది. సింగపూర్, సౌత్ కొరియాలు రెండు దేశాలు కూడా రెండో స్థానంలో నిలిచాయి.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. అల్లర్లు, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న యోగీ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. యోగీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ఓ క్యాబినెట్ మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు పంపారు. మరో మంత్రి జితిన్…