COVID CASES IN INDIA: కోవిడ్ విజృంభన తగ్గడం లేదు. వరసగా కొన్ని రోజులుగా దేశంలో రోజూవారీ కేసులు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా నెలన్నర కాలంగా రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా నమోదు అవుతోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. వరసగా నాలుగు రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలవరపరుస్తోంది. ఫోర్త్ వేవ్ కు దారితీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,528 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 49 మంది కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. గడిచిన ఒక రోజులో 17,790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం 1,43,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో 4,37,50,599 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 5,25,709 మంది మరణించగా.. 4,30,81,441 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.47గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.33 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
Read Also: IndiGo: ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. దీంతో పాటు రెండు రోజుల క్రితం 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దేశంలో ఇప్పటి వరకు అర్హులైన అందరికి కలిపి 199.98 డోసుల వ్యాక్సినేషన్ డోసులను అందించారు. నిన్న ఒక్క రోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్ లో నిన్న ఒక్క రోజే 1,24,009 మందికి కరోనా సోకింది. జపాన్ దేశంలో గడిచిన 24 గంటల్లో 99 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇటలీ, దక్షిణ కొరియా, బ్రెజిల్ దేశాల్లో కూడా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 56,70,61,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 63,86,836 మరణించారు.