దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని 31 డ్యామ్‌లకు వరద […]
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్లు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలను ఆదునీకరించడంతో పాటు ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది. ఐ2యూ2 కూటమిని పశ్చిమాసియా దేశాల క్వాడ్ […]
దేశంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది.ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను దాటింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,139 కేసులు నమోదు అయ్యాయి. 38 మంది కోవిడ్ బారినపడి మరణించారు. 16,482 […]
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును ఇండియాలోని ఓ వ్యక్తిలో గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తితో ఈఎంఎం నెగటివ్ బ్లడ్ గ్రూపును గుర్తించారు. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ప్రపంచంలో ఇప్పటి వరకు 10 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు. తాజాగా తొలిసారిగా ఇండియాలో గుర్తించారు. సాధారనంగా మనకు ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉంటాయి. మొత్తం మానవశరీరంలో 42 రకాల బ్లడ్ సిస్టమ్స్ […]
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జామాత్- ఉద్- దావా ( జేడీయూ)కు చెందిన ఇద్దరు సభ్యులను ప్రత్యర్థి గ్రూప్ కాల్చి చంపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్ జరన్ వాలా చక్ 97 జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జేడీయూకు చెందిన రషీద్ అలీ, షాహిద్ ఫరూఖ్ ఇద్దరు ఈద్ అల్ అదా ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా.. […]
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవుల రాజధాని మాలే నుంచి సింగపూర్ పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయారు గొలబాయ రాజపక్స. ఆయన భార్య ఇద్దరు బాడీగార్డులతో ఆయన మాలే చేరుకున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు పారిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆందోళనలను ఇంకా పెంచారు. ఏకంగా ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే […]
కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశవ్యాప్తం ఆందోళనకు సిద్ధం అవుతోంది. బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించనున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీ, కేంద్రప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గురువారం మరోసారి కాంగ్రెస్ ముఖ్య సమావేశం జరగనుంది. దీంట్లో ‘భారత్ జోడో యాత్ర’పై చర్చించనున్నారు. […]
అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. భూమికి 15 […]
శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి […]