Russian Leader Daughter Killed By Car Bomb: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, కీలక నేత అయి అలెగ్జాండర్ డుగిన్ కుమార్తెను దారుణంగా హత్య చేశారు. కారులో బాంబ్ పెట్టి హతమర్చారు. అయితే మెయిన్ టార్గెట్ అలెగ్జాండరే అని తెలుస్తోంది. అలెగ్జాండర్ కుమార్తె డారియా దుగినా కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో మాస్కోకు వెలుపల 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్షి వైజ్యోమీ గ్రామ సమీపంలో టయోటా ల్యాండ్ క్రూజర్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి డారియా దుగినా మరణించారు.…
instant loan apps mafia, Chinese Nationals Involved: రూ. 500 కోట్ల భారీ ఇన్స్టంట్ రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు సుమారుగా రెండు నెలల విచారణ తరువాత భారీ స్కామ్ ను ఛేదించారు. తక్షణ రుణాలు ఇచ్చి.. విపరీతమైన వడ్డీలు కట్టాల్సిందిగా ఈ ముఠా సామాన్య ప్రజలను వేధిస్తోందని పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి వచ్చే సూచనలతో ఈ ముఠా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ భారీ స్కామ్ లో చైనా జాతీయుల ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు.…
Himachal Pradesh Flash Floods: హిమాచల్ ప్రదేశ్ మెరుపు వరదులు, వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టిగా వానలు కురవడంతో మెరుపు వరదుల, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ పరిస్థితి ఏర్పడింది. మెరుపు వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగి పడటం మూలంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
Chandigarh Airport To Be Named After Shaheed Bhagat Singh: పంజాబ్, హర్యానా ప్రభత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చారు. ఈ మేరకు రెండు ప్రభత్వాలు అంగీకరించాయని.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం తెలిపారు. చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు షమీద్ భగత్ సింగ్ పేరును పెట్టనున్నారు.
Four minors killed the shop owner over Rs.500 issue: వయలెన్స్ ఫ్యాషన్ గా మారింది కొందరికి. నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాలని చూసిన నలుగురు మైనర్ యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కేవలం మురికిగా ఉన్న రూ. 500 నోటు ఇవ్వడంతో షాప్ యజమానికి, నలుగురు మైనర్లకు అయిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ భజన్ పురాలో చోటు చేసుకుంది.
Kerala starts government-owned online cab service: వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. గతంలో కేరళ సొంతగా ప్రభుత్వ ఓటీటీ ‘సీ స్పెస్’ ని ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోనే కేరళ ప్రభుత్వం ప్రజలకు మరన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. చవకగా, ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా పలు పథకాలను తీసుకువస్తోంది.
Congress Opposes Inclusion Of "Non-Locals" In Jammu-Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులను ఓటర్లగా ఓటర్ జాబితాలో చేర్చడాన్ని కాశ్మీరీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ అంశంపై తమ నిరసనను తెలియజేశాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికేతరులకు ఓటుహక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఓటు వేసేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
Bihar Deputy CM Tejashwi Yadav Requests for RJD Ministers: బీహార్ లో జేడీయూతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ) మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసి బీహార్ లో అధికారం చేపట్టింది. నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇన్నాళ్లు జేడీయూతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
Youth committed self-destruction for Canada visa: విధి ఎంత విచత్రంగా ఉంటుందో ఈ ఘటనను చూస్తే తెలుస్తుంది. వీసా ఆలస్యమవుతుందనే మనోవ్యథతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషాదకరంగా సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్న రోజే వీసా రావడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడే స్థిరపడాలని అనుకున్న యువకుడు.. ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
MLA help to carry the dead body of the woman in odisha:శవాలు తరలించేందుకు కనీసం అంబులెన్సులు ఇవ్వని ప్రభుత్వాసుపత్రులు, సొంతూళ్లకు తమ తల్లుల శవాన్ని, కుమారుల శవాలను తీసుకెళ్లేందుకు బైకులు ఆశ్రయించిన ఘటనలను ఎన్నో చూశాం. చివరకు అనారోగ్యం పాలైన తమ బంధువులను తోపుడు బండ్లలో ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం.. ఓ కుటుంబానికి సాయం చేయడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కనీసం డబ్బులు లేని…