Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
- గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కోరిన అసెంబ్లీ.
- అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం.
- జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి.
- గిల్గిట్-బాల్టిస్తాన్ భారత్ అంతర్భాగమేనన్న భారత వైఖరి యథాతథం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెరచాటున భారత్‌ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. పీఓకేలో భాగంగా ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ తన భూభాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్‌లో 5వ ప్రావిన్సుగా(రాష్ట్రం) ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే 4 ప్రావిన్సులు ఉన్నాయి.
పాకిస్తాన్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు ఇవ్వడం విశేషం. అసెంబ్లీలో ఎమ్మెల్యే జలాల్ అలీ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2009లో గిల్గిత్-బాల్టిస్తాన్ (ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్-గవర్నెన్స్) ఆర్డర్ ద్వారా శాసనసభ ఏర్పడింది. 2018 గిల్గిట్-బాల్టిస్తాన్ ఆర్డర్ ద్వారా శాసనసభకు మరిన్ని చట్టసభ అధికారాలు కల్పించిన విషయాన్ని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్లో తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి, గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ హోదా లభిస్తే ఇక్కడి ప్రజలకు పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేదిగా ఉంది. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లతో పాటు భారత్‌లో అంతర్భాగమే అని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల హోదాను మార్చేందుకు పాకిస్తాన్ చేపట్టే ఏ చర్యకు కూడా చట్టబద్ధత లేదని, వాటితో వాస్తవ పరిస్థితి మారదని భారత్ పలుమార్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!