Rajasthan Man Thrashed, Forced To Drink Urine: రాజస్థాన్ లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని రహస్యంగా కలిసేందుకు వచ్చిన యువకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, చెట్టుకు కట్టేసి బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ జలోర్ జిల్లాలో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. బాధిత యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Also: Hit and Drag: మరోసారి ఢిల్లీ ఘటన రిపీట్.. వ్యక్తిని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కార్..
పోలీసుల ప్రకారం.. బాధిత యువకుడు ఆదివారం రాత్రి సమీప గ్రామంలోని బాలికను కలిసేందుకు వచ్చాడు. ఇది తెలిసిన గ్రామస్తులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సమాచారం అందుకున్న యువకుడి కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని, అతడిని రక్షించాలని వేడుకున్నారు. అయినా కూడా గ్రామస్తులు ఆగ్రహం చల్లారలేదు. దీంతో యువకుడి నోటిలో మూత్రం పోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో జలోర్ ఎస్పీ హర్షవర్థన్ అగర్వాలా చర్యలు తీసుకున్నారు.
అయితే ఈ ఘటనపై ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. బాధితుడిని పోలీసులు సంప్రదించి, అతడి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై సదరు బాలిక పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణ సాగిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.