Shraddha Walkar Case: దేశంతో సంచలనం సృష్టించింది శ్రద్ధావాకర్ మర్డర్ కేసు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను అతడి లవర్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేయడంతో పాటు శరీరాన్ని 35 ముక్కులుగా చేసి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పారేశాడు. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ సంఘటన మే 18, 2022న జరిగితే దాదాపుగా ఆరు నెలల తరువాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో పోలీసుల ఛార్జిషీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రద్ధా వాకర్ ని హత్య చేసిన తర్వాత ఆమె ఎముకలనను పౌడర్ చేసేందుకు అఫ్తాబ్ ప్రయత్నించాడు. మిక్సర్ ఉపయోగించి ఎముకలను పౌడర్ చేయాలని భావించాడని, మూడు నెలల తర్వాత శ్రద్ధా తలను పారేశాడని పోలీసుల ఛార్జిషీట్ లో పేర్కొంది. ఈ కేసులో 6600 పేజీల ఛార్జిషీట్ ఫైల్ చేశారు పోలీసులు. శ్రద్ధా మొబైల్ ఫోన్ ను ముంబైలో పారేసినట్లు ఛార్జిషీట్ లో వెల్లడిస్తోంది. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ కు పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో-అనాలిసిస్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండు టెస్టుల్లో కూడా శ్రద్ధా వాకర్ ని హత్య తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
Read Also: Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
ఛార్జీషీట్ లో వివరాల ప్రకారం.. అఫ్తాబ్ కు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండటంతో తరుచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. హత్యా తరువాత అఫ్తాబ్ ఇతర గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన సందర్భంలో శరీర అవయవాలను కిచెన్ లో పెట్టి వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ ఫ్రిజ్ లో పెట్టేవాడు. శరీరాన్ని కోయడానికి రంపం, సుత్తి, 3 కత్తులను ఉపయోగించాడు. మే 18, 2022 తర్వాత అఫ్తాబ్ ఫోన్ నుండి శ్రద్ధా అకౌంట్లు ఉపయోగించాడని గూగుల్ విశ్లేషన వెల్లడించింది. మే 18 రాత్రి, ఆఫ్తాబ్ తన కోసం ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి చికెన్ రోల్ ఆర్డర్ చేశాడు, అదే రోజు శ్రద్ధ హత్యకు గురైంది. హత్య తరువాత పెద్ద ఎత్తున వాటర్ బాటిళ్లను అఫ్తాబ్ ఆర్ఢర్ చేశాడు.
శద్ధా ఛాతిపై కూర్చోని, చనిపోయే వారకు గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని బాత్రూంలో దాచాడు. రక్తాన్ని శుభ్రం చేయడానికి రెండు 500 ఎంఎల్ హార్పిక్ బాటిళ్లను, చాపింగ్ బోర్డు, 2,500 ఎంఎల్ షైన్‌ఎక్స్ గ్లాస్ క్లీనర్, 725 ఎంఎల్ గోద్రెజ్ ప్రొటెక్ట్ జెర్మ్ ఫైటర్ ఆక్వా లిక్విడ్ హ్యాండ్ వాష్ బాలిల్ ను బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసినట్లు ఛార్జీషీట్ లో పేర్కొన్నారు పోలీసులు.