Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilli Egg Recipe: ఎగ్స్‌తో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు, ఫ్రైలు తిని బోర్ కొట్టిందా..? అయితే ఇంట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ రుచితో అద్భుతమైన ‘స్పైసీ చిల్లీ ఎగ్’ తయారు చేసుకోవచ్చు. దీనిని స్టార్టర్‌గా నేరుగా తినేయొచ్చు లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వాటికి సైడ్ డిష్‌గా కూడా నంజుకోవచ్చు. ముఖ్యంగా స్పైసీగా తినాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. మరి దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* కోడిగుడ్లు – 6
* నూనె – సరిపడినంత
* వెల్లుల్లి రెబ్బలు – 5 (సన్నగా తరిగినవి)
* అల్లం – చిన్న ముక్క (సన్నగా తరిగినది)
* పచ్చిమిరపకాయ – 1 (సన్నగా తరిగినది)
* ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)
* క్యాప్సికం – 1 (పెద్ద ముక్కలుగా కోసినవి)
* ఉల్లికాడలు (Spring Onions) – కొద్దిగా
* ఉప్పు – రుచికి సరిపడా
* మిరియాల పొడి – 1 టీస్పూన్ + గుడ్ల కోసం కొద్దిగా
* కాశ్మీరీ కారం – 1 టీస్పూన్
* షెజ్వాన్ పేస్ట్ – 1 చిన్న టీస్పూన్
* సోయా సాస్ – 1 టీస్పూన్
* టొమాటో కెచప్ – 3 టేబుల్ స్పూన్లు
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలోకి ఆరు కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి (విస్క్ చేయాలి). మిశ్రమం అంతా నురుగు వచ్చేలా ఫ్లఫీగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టీస్పూన్ల నూనె వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. నూనె వేడెక్కాక గుడ్డు మిశ్రమాన్ని వేసి, అంచులను నెమ్మదిగా మధ్యలోకి నెడుతూ పొరటులా చేసుకోవాలి. అయితే, సాధారణ పొరటులా కాకుండా ముక్కలు కాస్త పెద్ద సైజులో ఉండేలా జాగ్రత్తగా కలుపుకొని, వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో (లేదా ఒక వెడల్పాటి పాన్) ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. మంటను కాస్త తగ్గించి, వెడ్జెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌పై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీస్పూన్ కాశ్మీరీ కారం వేసుకోవాలి. రుచిని పెంచేందుకు ఒక చిన్న టీస్పూన్ షెజ్వాన్ పేస్ట్, ఒక టీస్పూన్ సోయా సాస్, మూడు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికం ముక్కలు కాస్త ఉడకడం కోసం కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
సాస్ మిశ్రమం కాస్త చిక్కబడుతున్న సమయంలో క్రంచీ టేస్ట్ కోసం కొన్ని తరిగిన ఉల్లికాడలను (Spring onions) వేయాలి. సాస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గుడ్డు పొరటు ముక్కలను ఇందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. సాస్ అంతా గుడ్డు ముక్కలకు బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలి. చివరగా మరికొన్ని ఉల్లికాడలను పైనుంచి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన ‘స్పైసీ చిల్లీ ఎగ్’ రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతమైన రుచితో బాగుంటుంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు